/rtv/media/media_files/2025/06/18/pregnant-woman-2025-06-18-20-34-32.jpg)
Pregnant woman
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గర్భిణికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు సూది మర్చిపోయారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం హుజురాబాద్ ఏరియా ఆస్పత్రికి జమ్మికుంటకు చెందిన ఓ గర్భిణి ప్రసవం కోసం వచ్చింది.
Also Read: ఇండిగో విమానంలో చిక్కుకున్న మరో మాజీ CM
దీంతో ఆమెకు వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. తల్లిబిడ్డా క్షేమంగానే ఉన్నారు. కానీ తల్లికి కుట్లు వేసి సూది కడుపులోనే వదిలేశారు. ఆ తర్వాత వాళ్లకి సూది కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన వైద్యులు ఆమెకు వెంటనే ఎక్స్‌రే తీశారు. సూది కడుపులో ఉన్న విషయాన్ని గుర్తించి కుట్లు విప్పి సూది బయటకు తీశారు.
Also Read: ఇరాన్‌లో 1,100 లక్ష్యాలను ధ్వంసం చేశాం.. ఇజ్రాయెల్ కీలక ప్రకటన
ఈ విషయం 3 రోజుల తర్వాత బయటపడింది. అయితే ఇందులో తమ తప్పు లేదని ఆస్పత్రి సూపరింటెండెంట్ నారాయణరెడ్డి తెలిపారు. కుట్లు వేసే సమయంలో సూది కడుపులో పడిపోయిందని.. వెంటనే ఎక్స్‌రే తీసి దాన్ని బయటకు తీశామని చెప్పారు. ప్రస్తుతం బాధితురాలికి ఆస్పత్రిలో చికిత్స సాగుతోంది.
Also Read: 1978 కి ముందు ఇరాన్ ఎలా ఉండేదో తెలుసా ?.. వీడియోలు వైరల్