PM Modi : ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి ఉండకూడదు: మోదీ

ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి ఉండకూడదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కెనడా పర్యటనలో భాగంగా జీ7 సదస్సులో ఆయన ప్రసంగించారు.  ‘‘పహల్గాం ఉగ్ర దాడి.. మానవత్వంపై జరిగిన దాడి. ఇది భారతీయుల గౌరవం, గుర్తింపుపై జరిగిన దాడి. దీన్ని అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.

New Update
Narendra Modi

Narendra Modi

PM Modi : ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి ఉండకూడదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జీ7 సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కెనడాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జీ7 సదస్సులో ఆయన ప్రసంగించారు.  ‘‘పహల్గాం ఉగ్ర దాడి.. మానవత్వంపై జరిగిన దాడి. ఇది భారతీయుల గౌరవం, గుర్తింపుపై జరిగిన దాడి. మానవత్వానికి ఉగ్రవాదం శత్రువు. అన్ని దేశాలు దీన్ని వ్యతిరేకించాలి. ప్రపంచ శాంతి, సుస్థిరత కోసం మా విధానాలు, ఆలోచనలు స్పష్టంగా ఉన్నాయి. ఎవరైనా ఉగ్రవాదానికి మద్దతు ఇస్తే.. మూల్యం చెల్లించక తప్పదు. కొన్ని దేశాలు ఓవైపు ఉగ్రవాదాన్ని ఖండిస్తూనే.. మరోవైపు మద్దతు ఇస్తున్నాయి’’ అని మోదీ ఆరోపించారు.

Also Read: 1941, 2025 క్యాలెండర్ సేమ్‌ టు సేమ్.. అప్పుడు యుద్ధాలే ఇప్పుడు యుద్ధాలే !


కాగా జీ7 సదస్సులో పాల్గొనడానికి కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ ప్రధాని మోదీని ఆహ్వానించారు. ఆయన పిలుపుమేరకు కెనడా చేరుకున్న ప్రధానికి ఘనస్వాగతం లభించింది. ఈ నేపథ్యంలో కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ, భారత ప్రధాని మోదీ మధ్య చర్చలు జరిగాయి. ఇందులో దౌత్యవేత్తల పునర్‌ నియామకంపై ఏకాభిప్రాయం కుదిరింది. కెనడా గత ప్రధాని ట్రూడో హయాంలో ఇరు దేశాల మధ్య విభేదాలు వచ్చాయి. ఈక్రమంలో దౌత్యవేత్తలను ఇరు దేశాలు వెనక్కి పిలిపించుకున్నాయి. మరోవైపు తాజా నిర్ణయంతో భారత్‌, కెనడా సంబంధాలు మరింత బలోపేతమవుతాయని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ తెలిపారు. 

Also Read: చైనాలో భారీ పేలుడు..9 మంది దుర్మరణం..26 మంది తీవ్రంగా..


 ఇటలీ, ఇండియా దోస్త్‌ మేరా దోస్త్‌.. మోదీ ఫొటోతో మెలోనీ పోస్ట్‌ వైరల్


కాగా జీ7 సదస్సులో పాల్గొంటున్న ప్రధాని మోదీని ఉద్దేశించి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఇండియాతో తమ దేశ స్నేహ సంబంధాలు దృఢంగా పెనవేసుకుపోయాయని పోస్టు పెట్టిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ.  మీరు చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నానని భారత ప్రధాని నరేంద్రమోదీ ఎక్స్‌లో ఆమెకు రిప్లై ఇచ్చారు.ఈ స్నేహంతో రెండు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరాలని ఆకాంక్షించారు. కాగా తగ ఏడాది ఇటలీలో జరిగిన జీ7 సదస్సులో పాల్గొన్నారు. ఇటలీ ప్రధాని జార్జీయ మెలోనీ ఆహ్వానం మేరకు ఆయన ఇటలీలోని అపులియాకు వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీలు తీసుకున్న సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోను ఇటలీ ప్రధాని మెలోనీ తన ‘ఎక్స్’ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ పై నాడు ప్రధాని మోదీ కూడా స్పందించారు.  

Also read: 48 గంటల్లో 9 విమానాల్లో సమస్యలు.. ఎయిర్ ఇండియాకు అసలేమైంది?

Advertisment
తాజా కథనాలు