BIG BREAKING: కోల్‌కతా ఎయిర్‌పోర్టులో కొడాలి నాని అరెస్ట్‌..

మాజీమంత్రి వైసీపీ నేత కొడాలినానిని కోల్‌కతా ఎయిర్‌పోర్టులో పోలీసులు అరెస్ట్‌ చేశారు. కోల్‌కతా నుంచి కొలంబో వెళ్తుండగా ఆయనను ఎయిర్‌పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఏపీలో నమోదైన కేసులో కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీఅయిన విషయం తెలిసిందే.

New Update
Kodali nani

Kodali nani

BIG BREAKING:

మాజీమంత్రి వైసీపీ నేత కొడాలి నానిని కోల్‌కతా ఎయిర్‌పోర్టులో పోలీసులు అరెస్ట్‌ చేశారు.  కోల్‌కతా( kolkata)  నుంచి కొలంబో వెళ్తుండగా ఆయనను ఎయిర్‌పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం(Kodali Nani Arrest Issue). ఏపీలో నమోదైన కేసులో కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే. దీంతో కోల్‌కతా ఎయిర్ పోర్టులో కొడాలి నానిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.  కాగా కొడాలి నాని తీవ్ర అనారోగ్యంతో కొద్ది రోజులు హైదరాబాద్‌లో చికిత్స తీసుకున్నారు(kodali nani health latest news). అనంతరం ముంబై ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్‌లో చేరారు. ఆ తర్వాత ఆయనకు గుండె సంబంధింత సర్జరీ చేశారు. ముంబైలో ఉన్నారని, త్వరలోనే రాష్ట్రానికి వస్తారని వైసీపీ నేతలు తెలిపారు.  

Also Read: 1941, 2025 క్యాలెండర్ సేమ్‌ టు సేమ్.. అప్పుడు యుద్ధాలే ఇప్పుడు యుద్ధాలే !

కొడాలి పైన పలు కేసులు ఉన్నాయి. లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు కోల్కత్తా విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.  వైసీపీ హయాం లో కొడాలి నాని అక్రమాలకు పాల్పడ్డారనే ఫిర్యాదులు ఉన్నాయి. కూటమి అధికారం లోకి వచ్చిన తరువాత కొడాలి నాని పైన కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఆ తరువాత అనారోగ్య సమస్యలతో కొడాలి నాని ఆస్పత్రిలో చేరారు. ముంబాయి లోని ఆస్పత్రిలో నానికి బైపాస్ సర్జరీ చేసారు. క్రమేణా కోలుకుంటున్న కొడాలి నాని కొద్ది రోజులు గా తిరిగి వ్యక్తిగత కార్యక్రమాలకు హాజరు అవుతున్నారు.

Also Read: 1941, 2025 క్యాలెండర్ సేమ్‌ టు సేమ్.. అప్పుడు యుద్ధాలే ఇప్పుడు యుద్ధాలే !

కొద్ది రోజుల క్రితం ఒక వివాహ వేడుకలో నాని హాజరైన ఫొటోలు వైరల్ అయ్యాయి. అదే సమయం లో కొడాలి నాని పైన లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. కాగా, తాజాగా కలకత్తా నుంచి కొలంబో వెళ్తున్న కొడాలి నానిని పోలీసులు ఆపారు. లుకౌట్ నోటీసుల కింద కొడాలి నాని ని అడ్డుకున్న పోలీసులు.. ఏపీలో పోలీసుల అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో, ఇప్పుడు పోలీసులు ఏం చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది. 

Also Read: 48 గంటల్లో 9 విమానాల్లో సమస్యలు.. ఎయిర్ ఇండియాకు అసలేమైంది?

ఆయనను అరెస్ట్‌ చేసి ఏపీకీ తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన కొలంబో ఎందుకు వెళ్తున్నారు అనేది ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. ఆయన కేసుల నుంచి తప్పించుకోవడానికి పారిపోతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆయితే ఆయనకున్న వ్యక్తిగత పనుల నిమిత్తం కొలంబో వెళుతున్నారని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు.  

Also Read: కర్ణాటకలో దారుణం.. కుమారుడు అల్లరి చేస్తున్నాడని ఓ తల్లి ఇనుప కడ్డీతో..

Advertisment
తాజా కథనాలు