Road Accident: ఊహించని మృత్యువు.. ఫ్లైఓవర్ పైనుంచి వ్యాన్ పడి నలుగురు స్పాట్‌డెడ్

ఆగ్రాలోని షాహ్దరా చుంగి ఫ్లైఓవర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మామిడికాయలతో వెళుతున్న వ్యాన్ ఫ్లైఓవర్‌‌పై అదుపుతప్పి కింద కూర్చున్న మార్నింగ్ వాకర్లపై పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు స్పాట్‌లో మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

New Update
Road Accident at Shahdara Chungi Flyover 4 Killed,1 Injured

Road Accident at Shahdara Chungi Flyover 4 Killed,1 Injured

ఆగ్రాలోని ట్రాన్స్ యమునా ప్రాంతం కింద ఉన్న షాహ్దరా చుంగి ఫ్లైఓవర్ వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు స్పాట్‌లో మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: 1941, 2025 క్యాలెండర్ సేమ్‌ టు సేమ్.. అప్పుడు యుద్ధాలే ఇప్పుడు యుద్ధాలే !

Agra Road Accident

మామిడికాయలను తీసుకెళ్తున్న పికప్ వ్యాన్ అదుపు తప్పి ఫ్లైఓవర్ పై నుంచి కిందికి పడిపోయింది. దీంతో నిర్మాణం కింద కూర్చున్న ముగ్గురు మార్నింగ్ వాకర్లపై పడటంతో స్పాట్‌లో ముగ్గురు.. వ్యాన్ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. వ్యాన్‌లో ఉన్న మరొక వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. 

Also Read: 48 గంటల్లో 9 విమానాల్లో సమస్యలు.. ఎయిర్ ఇండియాకు అసలేమైంది?

అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ (ACP) హేమంత్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘షాహ్దరా చుంగి ఫ్లైఓవర్ పై ఈ ప్రమాదం జరిగింది. మామిడికాయలను తీసుకెళ్తున్న పికప్ వ్యాన్ అదుపు తప్పి ఫ్లైఓవర్‌ నుంచి కింద పడిపోయింది. మార్నింగ్ వాక్ కోసం వెళ్లిన ముగ్గురు వ్యక్తులు కింద కూర్చున్నారు. ఆ సమయంలో వాహనం వారిపై పడింది. వారు అక్కడికక్కడే మరణించారు. వాహనం లోపల డ్రైవర్, సహాయకుడు ఉన్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ మరణించాడని, సహాయకుడి పరిస్థితి విషమంగా ఉంది.’’ అని తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Also Read: కర్ణాటకలో దారుణం.. కుమారుడు అల్లరి చేస్తున్నాడని ఓ తల్లి ఇనుప కడ్డీతో..

Advertisment
Advertisment
తాజా కథనాలు