TG RAIN UPDATE: తెలంగాణలో 5 రోజులు వర్షాలే వర్షాలు.. ఈ జిల్లాల్లో దంచుడే

తెలంగాణలో నేటి నుంచి 5రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ఏపీలోనూ పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి.

New Update
Weather Department Big Alert andhra pradesh and telangana Rains

Telangana Rain update Telangana rain many districts today


తెలంగాణలోని పలు జిల్లాల్లో గత కొద్ది రోజుల నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఇలా ఎండా వానలు ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే ఇప్పుడు రాష్ట్రంలో వరుసగా వర్షాలు దంచికొట్టనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. 

Also Read: 1941, 2025 క్యాలెండర్ సేమ్‌ టు సేమ్.. అప్పుడు యుద్ధాలే ఇప్పుడు యుద్ధాలే !

Telangana Rain update

తెలంగాణలో నేటి నుంచి రాబోయే ఐదు రోజుల పాటు కుండపోత వర్షాలు పడనున్నట్లు తెలిపింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో పలు జిల్లాల్లో పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని HYD వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 

Also Read: 48 గంటల్లో 9 విమానాల్లో సమస్యలు.. ఎయిర్ ఇండియాకు అసలేమైంది?

ఇవాళ జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వానలు జోరుగా కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు సైతం వీచే ఛాన్స్ ఉందని.. అందువల్ల ప్రజలందరూ తమ తమ ఇళ్లలోనే ఉండాలని సూచించారు. 

Also Read: కర్ణాటకలో దారుణం.. కుమారుడు అల్లరి చేస్తున్నాడని ఓ తల్లి ఇనుప కడ్డీతో..

ఎవరు కూడా చెట్ల కింద, పాడుబడ్డ భవనాల కింద ఉండకూడదని తెలిపారు. ఈ మేరకు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇదిలా ఉంటే అటు ఏపీలోనూ పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది. మన్యం, అల్లూరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని APSDMA ట్వీట్ చేసింది. మిగతా చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. 

Also Read :  కోర్టు ఆగ్రహానికి గురైన కన్నప్ప సినిమా.. సెన్సార్ లేకుండానే విడుదలపై సందేహాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు