Murder: పెళ్లి చేసుకుంటానని నమ్మించి..గొంతుకోసి...

ప్రేమించినవాడు పెళ్లి చేసుకుంటానంటే నమ్మింది. అతనితో పాటు ఏడడుగులు నడవాలని ఆశపడింది. పెళ్లిపేరుతో బెంగళూరు నుంచి గోవాకు తీసుకెళ్లి గొంతుకోసి హత్య చేశాడో ప్రబుద్ధుడు.  ప్రేమ సంబంధం, పెళ్లి ప్రతిపాదనతో వచ్చిన గొడవ కారణంగా హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు.

New Update
Murder of a lover

Murder in gao

Murder: ప్రేమ పేరుతో మోసం చేయడం, మోస పోవడం సర్వసాధారణమైంది. ఆడ,మగ అనే తేడా లేదు.  ప్రేమ పేరుతో ఒకరినొకరు మోసం చేసుకోవడం సర్వసాధారణమైంది. కానీ విషాదం ఏంటంటే ప్రేమ పేరుతో ప్రాణాలు తీయడం. అలాంటిదే బెంగళూరుకు చెందిన యవతి ప్రేమకథ విషాదాంతమైంది. ప్రేమించినవాడు పెళ్లి చేసుకుంటానంటే నమ్మింది. అతనితో పాటు ఏడడుగులు నడవాలని ఆశపడింది. కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ అమ్మాయి గొంతుకోసి హత్య చేశాడో ప్రబుద్ధుడు.

Also Read : AIతో క్యాన్సర్ టెస్ట్.. కేవలం రూ.3 వేలకే.. ఎలా పని చేస్తుందంటే?

దక్షిణ గోవాలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.  కర్ణాటకలోని ఉత్తర బెంగళూరుకు చెందిన సంజయ్ కెవిన్ ఎం (22), అదే ప్రాంతానికి చెందిన రోష్ని మోసెస్ ఎం (22) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో వీరిద్దరూ ఇటీవల బెంగళూరు నుంచి గోవాకు వెళ్లారు. అయితే, అక్కడ వారి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ, ఓ తీవ్రమైన వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం సంజయ్, రోష్నిని హత్య చేసి, ఆమె మృతదేహాన్ని దక్షిణ గోవాలోని ప్రతాప్ నగర్ అటవీ ప్రాంతంలో పడేసి పారిపోయినట్టు పోలీసులు తెలిపారు.

Also Read: కర్ణాటకలో దారుణం.. కుమారుడు అల్లరి చేస్తున్నాడని ఓ తల్లి ఇనుప కడ్డీతో..

సోమవారం సాయంత్రం ప్రతాప్ నగర్ అటవీ ప్రాంతంలో ఓ యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, యువతిని గొంతు కోసి హత్య చేసినట్టు నిర్ధారించారు. ఆమె రోష్ని మోసెస్‌గా గుర్తించారు. ప్రేమ వ్యవహారం, పెళ్లి ప్రతిపాదన, దానివల్ల తలెత్తిన గొడవే ఈ హత్యకు కారణమని దక్షిణ గోవా ఎస్పీ టికమ్ సింగ్ వర్మ తెలిపారు.

Also Read: 1941, 2025 క్యాలెండర్ సేమ్‌ టు సేమ్.. అప్పుడు యుద్ధాలే ఇప్పుడు యుద్ధాలే !

మృతదేహం లభ్యమైన తర్వాత పోలీసులు వెంటనే దర్యాప్తు ముమ్మరం చేశారు. వారికి లభించిన కీలక సమాచారం ఆధారంగా నిందితుడిని సంజయ్ కెవిన్‌గా గుర్తించారు. హత్య వెలుగుచూసిన 24 గంటల్లోపే సంజయ్ ఆచూకీని బెంగళూరులో కనిపెట్టి అరెస్టు చేశారు.  ప్రేమ సంబంధం, పెళ్లి ప్రతిపాదనతో వచ్చిన గొడవ కారణంగా జరిగిన హత్య అని పేర్కొన్నారు. మృతదేహాన్ని గుర్తించిన తర్వాత విచారణ ప్రారంభించినట్లు దర్యాప్తులో సంజయ్ హత్య చేసినట్లు ఆధారాలు లభించాయని పేర్కొన్నారు. 24 గంటల్లోనే బెంగళూరులో నిందితుడిని పట్టుకున్నామని దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Also Read: 48 గంటల్లో 9 విమానాల్లో సమస్యలు.. ఎయిర్ ఇండియాకు అసలేమైంది?

Advertisment
Advertisment
తాజా కథనాలు