/rtv/media/media_files/2025/06/18/Pakistan Jaffar Express Train Derails After Bomb Explosion-ec4103d5.jpg)
Pakistan Jaffar Express Train Derails After Bomb Explosion
పాకిస్తాన్‌లో మరో ఘోరమైన ప్రమాదం చోటుచేసుకుంది. పెషావర్ నుండి పాకిస్తాన్‌లోని క్వెట్టాకు వెళ్తున్న రైలులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనతో రైలులోని 4 నుంచి 6 పట్టాలు తప్పాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం పాకిస్తాన్‌లోని జకోబాబాద్ సమీపంలో జరిగింది. అయితే ఈ సంఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు ఇంకా వెల్లడికాలేదు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
An explosion occurred on the railway track near Jacobabad, Balochistan province causing four coaches of the Jaffar Express to derail. The train was en route from Peshawar to Quetta. According to police, the blast left a 3-foot-wide crater on the track, and around 6 feet of the… pic.twitter.com/ltXbrEUwdt
— Abdullah Jan Sabir (@AbdullahJanSab1) June 18, 2025
Jaffar Express Train Derails
Also Read: 1941, 2025 క్యాలెండర్ సేమ్ టు సేమ్.. అప్పుడు యుద్ధాలే ఇప్పుడు యుద్ధాలే !
Atleast 4 to 6 bogies of #jaffarexpress running from #Quetta to #Peshawar derailed after a blast on railway track near #Jacobabad, #Sindh #Pakistan. No casualty reported so far. Train services have been temporarily suspended. #PakistanIndianWar #iranisraelwar #Balochistan pic.twitter.com/2pq4Rds8x2
— Bharat Verma 🇮🇳 (@Imbharatverma) June 18, 2025
Also Read: 48 గంటల్లో 9 విమానాల్లో సమస్యలు.. ఎయిర్ ఇండియాకు అసలేమైంది?
గత నెలలో ఇదే రైలు హైజాక్
ఇదిలా ఉంటే ఇదే రైలును గత నెలలో బలూచ్ తిరుగుబాటుదారులు హైజాక్ చేసిన విషయం తెలిసిందే. మార్చిలో పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను బలూచ్ సైన్యం స్వాధీనం చేసుకున్నారు. రైలును హైజాక్ చేసి 214 మంది ప్రయాణికులను బందీలుగా ఉంచారు. అందులో పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ ఆర్మీ సైనికులు కూడా ఉన్నారు. వారిలో కొందరిని BLA కాల్చి చంపింది.