🔴Live News Updates: భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
LIVE BLOG

LIVE BLOG

🔴Live News Updates:

Earthquake: ఓరి దేవుడా.. భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ - వణుకు పుట్టిస్తున్న వీడియోలు

అమెరికాలోని అలాస్కా తీరంలో భారీ భూకంపం సంభవించింది. బుధవారం రిక్టర్‌ స్కేల్‌పై 7.3 తీవ్రతతో భూకంపం  సంభవించిందని అధికారులు తెలిపారు. దీంతో అమెరికా జియోలాజికల్ సర్వే సునామీ హెచ్చరికలు జారీ చేసింది.

Earthquake
Earthquake

అమెరికాలోని అలాస్కా తీరంలో భారీ భూకంపం సంభవించింది. బుధవారం రిక్టర్‌ స్కేల్‌పై 7.3 తీవ్రతతో భూకంపం  సంభవించిందని అధికారులు తెలిపారు. దీంతో అమెరికా జియోలాజికల్ సర్వే సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరిగినట్లు ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు. 

Also Read : అసలు నువ్వు తండ్రేనా.. ఫోన్‌ చూస్తోందని నాలుగేళ్ల కూతురిని గొంతు నులిమి దారుణంగా..!

Also Read: పాకిస్థాన్‌కు మరింత గడ్డు కాలం.. ఆగిపోయిన నిధులు, టర్కీతో కటీఫ్ !

Earthquake Alaska 

అయితే ఈ భూకంపం సమయంలో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. స్థానిక సమయం ప్రకారం (2037 GMT) సుమారు మధ్యాహ్నం 12:37 గంటలకు అక్కడ భూకంపం సంభవించింది. 

Also Read: తెలంగాణలో ఈ నెల 23న స్కూళ్లు, కాలేజీలు బంద్.. ఎందుకో తెలుసా?

కాగా భూకంపం తర్వాత దక్షిణ అలాస్కా, అలాస్కా ద్వీపకల్పానికి అధికారులు సునామీ హెచ్చరిక జారీ చేశారు. దక్షిణ అలాస్కా, అలాస్కా ద్వీపకల్పం, అలాస్కాలోని కెన్నెడీ ఎంట్రన్స్ నుండి అలాస్కాలోని యూనిమాక్ పాస్ వరకు పసిఫిక్ తీరాలకు ఈ హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు పౌరులు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని ముందస్తు జాగ్రత్తగా అధికారులు సూచించారు. 

Also Read:TG Murder: అక్రమ సంబంధం వల్లే హత్య..   చందు నాయక్‌ హత్య కేసులో సంచలన విషయాలు!

  • Jul 17, 2025 10:06 IST

    Telangana Villages : బిగ్ షాక్.. తెలంగాణలోని 14 గ్రామాలు మహారాష్ట్రలో విలీనం !

    మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని 14 గ్రామాలు మహారాష్ట్రలో విలీనం కావాలనే అంశంపై మహారాష్ట్ర అటవీశాఖ మంత్రి చంద్రశేఖర్ బావన్కులే కీలక ప్రకటన చేశారు.

    telangana-villages



  • Jul 17, 2025 10:05 IST

    CM Nitish Kumar : బిగ్ అనౌన్స్మెంట్.. బీహార్ సీఎం సంచలన ప్రకటన !

    బీహార్ ఎన్నికలు వేడెక్కుతున్న తరుణంలో  ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురువారం సంచలన ప్రకటన చేశారు. 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. 125 యూనిట్ల లోపు కరెంటు బిల్లులను చెల్లించనక్కర్లేదని వెల్లడించారు.

    cm-nithish-kumar



  • Jul 17, 2025 10:05 IST

    Kavitha : ఎమ్మెల్సీ కవితకు కేటీఆర్ బిగ్ షాక్..ఊహించని ట్విస్ట్!

    బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిగ్ షాకిచ్చారు.  తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇంఛార్జ్‌గా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నియమించారు.   తెలంగాణ భవన్‌లో బుదవారం కేటీఆర్‌ సింగరేణి కార్మిక సంఘాల సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.  

    kavitha-ktr



  • Jul 17, 2025 10:04 IST

    Indian Army Soldier : పాక్‌కు గూఢచర్యం.. జమ్మూకశ్మీర్‌లో ఇండియన్ ఆర్మీ అరెస్టు

    ISIకు రహస్య సైనిక సమాచారాన్ని లీక్ చేశాడనే ఆరోపణలతో పంజాబ్ పోలీసుల రాష్ట్ర ప్రత్యేక ఆపరేషన్ సెల్ ఒక భారత సైనికుడిని  అరెస్టు చేసింది. నిందితుడిని సంగ్రూర్ జిల్లాలోని నిహల్‌గఢ్ గ్రామానికి చెందిన దేవిందర్ సింగ్‌గా గుర్తించారు.

    army



  • Jul 17, 2025 07:38 IST

    Heart Attack : అయ్యో దేవుడా.. గుండెపోటుతో 9 ఏళ్ల బాలిక మృతి!

    ఇటీవలి కాలంలో గుండెపోటుతో చిన్న వయసులోనే మరణిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. దురదృష్టవశాత్తు, ఓ 9 ఏళ్ల బాలిక గుండెపోటుతో మరణించిన విషాద సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.

    rajasthan



  • Jul 17, 2025 07:38 IST

    AP Road Accident: ఏపీలో ఘోరం.. రోడ్డు దాటుతుండగా మహిళా టీచర్‌ను ఢీకొట్టిన కారు - స్పాట్ డెడ్

    ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతుండగా ఒక కారు మహిళా టీచర్‌ పద్మావతిని ఢీకొట్టింది. దీంతో అటువైపుగా వెళ్లిన మంత్రి సత్యకుమార్ యాదవ్ గమనించి ఆమెను తన కారులో హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు

     

    AP Road Accident
    AP Road Accident

     



  • Jul 17, 2025 07:38 IST

    Punjab Lottery : లక్కంటే నీదేరా.. రూ. 6 పెట్టి లాటరీ కొంటే జీవితాన్ని మార్చే ఫోన్ కాల్!

    అవును లక్కంటే ఇతనిదే.. అదృష్టం మాములుగా తగల్లేదు. జాక్ పాట్ కొట్టేశాడు.  రూ. 6 పెట్టి లాటరీ టికెట్ కొంటే ఏకంగా రూ.కోటి తగిలింది.  ఇంతకు ఎవరీతను... ఏంటా స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం.  

    lukkky



  • Jul 17, 2025 07:11 IST

    Israel: మిత్ర దేశాలు వాకౌట్..పార్లమెంటరీ మెజార్టీ కోల్పోయిన నెతన్యాహు పార్టీ

    ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అల్ట్రా-ఆర్థడాక్స్ పార్టీ రాజీనామా చేసి ప్రభుత్వం నుంచి అధికారికంగా వైదొలిగింది. దీంతో నెతన్యాహు పార్టీ పార్లమెంటరీ మెజార్టీని కోల్పోయింది. ఇది అక్కడ రాజకీయ అస్థిరతను సూచిస్తుంది.

     

    netanyahu (1)
    Isreal PM Netanyahu

     



  • Jul 17, 2025 07:11 IST

    Virat Kohli : రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా

    విరాట్ కోహ్లీ టీ20, ఇటీవల టెస్టుల నుంచి రిటైర్ అయినప్పటికీ రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాడు. విరాట్ తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడు ఫార్మాట్లలో (టెస్టులు, వన్డేలు, టీ20లు) 900కు పైగా రేటింగ్ పాయింట్లు సాధించిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

    virat-kohlui



  • Jul 17, 2025 07:10 IST

    INDW vs ENGW: ఇంగ్లాండ్‌పై భారత్‌ ఘన విజయం.. సెంచరీకి ఒక్క పరుగులో మంధాన ఔట్

    సౌతాంప్టన్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత మహిళల జట్టు అద్భుత విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో భారత్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

     

    india womens team beat england by 4 wickets in 1st odi
    india womens team beat england by 4 wickets in 1st odi

     



  • Jul 17, 2025 07:10 IST

    Amberpet: మతాంతర వివాహం చేసుకుని.. ఉరేసుకుని నవదంపతులు ఆత్మహత్య

    అంబర్‌పేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మతాంతర వివాహం చేసుకున్న ప్రేమజంట నాలుగు నెలలకే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.  మనస్పర్థలు, ఆర్థిక ఇబ్బందులే వీరి ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది.

    amabarpet



Advertisment
Advertisment
తాజా కథనాలు