Pawan Kalyan: పవన్ ఎందుకు మాట్లాడడం లేదు? జనసేన నుంచి రూ.30 లక్షలు.. డ్రైవర్ రాయుడు చెల్లి సంచలన ఆరోపణలు!

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జి కోట వినూత మాజీ డ్రైవర్ రాయుడు హత్య కేసులో సంచలన ఆరోపణలు చేసింది. డ్రైవర్ రాయుడు చెల్లి డీఎస్పీ ఆఫీసుకు వెళ్లి తమకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించమని డీఎస్పీని కోరింది. తమకి రూ.30 లక్షలు ఆఫర్ చేశారని తెలిపింది.

New Update
Tirupathi Case

Tirupathi Case

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జి కోట వినూత మాజీ డ్రైవర్ రాయుడు హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డ్రైవర్ రాయుడు చెల్లి డీఎస్పీ ఆఫీసుకు వెళ్లారు. తమకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించమని డీఎస్పీకి ఆమె మొరపెట్టుకుంది. వారు తనకి రూ.30 లక్షలు ఆఫర్ చేశారని, కానీ తాము ఒప్పుకోలేదని రాయుడు చెల్లి తెలిపింది.

ఇది కూడా చూడండి: Man Chewed Snake: పచ్చి తాగుబోతు.. మద్యం మత్తులో పామును కొరికి మింగేశాడు - షాకింగ్ వీడియో

ఇది కూడా చూడండి:Kadapa Girl Incident: లవర్ కాదు.. అన్న కాదు - గండికోట ఇంటర్ స్టూడెంట్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్..!

పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించాలని..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిన్న విషయానికి స్పందించే అతను ఇప్పుడు కనీసం స్పందించడం లేదని వెల్లడించింది. మేం పవన్ కళ్యాణ్‌తో మాట్లాడాలి.. దయచేసి ఒక అవకాశం ఇవ్వమని రాయుడు చెల్లి డీఎస్పీని కోరింది. అలాగే సోషల్ మీడియాలో తమ అన్న కోసం వస్తున్న అక్రమ సంబంధంలో నిజం లేదని, తన అలాంటి వాడు కాదని, ఇవి కేవలం పుకార్లు అని ఆమె తెలిపింది. అయితే దీనికి పోలీసులు స్పందిస్తూ పూర్తి వివరాలు ఇస్తేనే ఫిర్యాదు తీసుకుంటామని అన్నారు.

ఇది కూడా చూడండి:  Mohammed Shami ex wife: టీమిండియా క్రికెటర్ షమీ మాజీ భార్య, కూతురిపై క్రిమినల్ కేసు - షాకింగ్ వీడియో

ఇదిలా ఉండగా వినుతకు, డ్రైవర్ రాయుడికి అక్రమ సంబంధం ఉందని, అలాగే కొన్ని వీడియోలు ఉన్నాయని ఈ క్రమంలోనే ఆమె చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. వినుత, తన భర్తతో పాటు మరో ఐదుగురు రాయుడుని హత్య చేసినట్లు సమాచారం. ఇప్పటికే చెన్నై పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. మరి దీనిపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ స్పందిస్తారో లేదో చూడాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు