/rtv/media/media_files/2025/07/17/jana-natya-mandali-founder-sanjeev-surrenders-2025-07-17-14-50-08.jpg)
Jana Natya Mandali founder Sanjeev surrenders
దేశంలో మావోయిస్టులను లేకుండా చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నట్లే దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా జరిగిన ఎన్‌కౌంటర్లలో మావోయిస్టు అగ్రనేతలు పలువురు అశువులు బాశారు.మరోవైపు పలువురు మావోయిస్టు నేతలు లొంగుబాటు బాట పడుతున్నారు. తాజాగా జన నాట్యమండలి వ్యవస్థాపకుడు, దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శివర్గ సభ్యుడు సంజీవ్ అలియాస్ లెంగు దాదా, అతని భార్య రాష్ట్ర కమిటీ సభ్యురాలు పెరుగుల పార్వతి అలియాస్ బొంతల పార్వతి అలియాస్ దీనా గురువారం హైదరాబాద్ రాచకొండ పోలీస్ కమీషనర్ సుధీర్ బాబు ఎదుట లొంగిపోయారు.
ఇది కూడా చూడండి: Aadhaar Card: కోట్లల్లో మరణాలు.. ఇంకా యాక్టివ్‌లో ఉన్న ఆధార్ కార్డులు
Big Shock For Maoists
నాలుగు దశాబ్దాల పాటు సీపీఐ మావోయిస్టు పార్టీలో కీలకంగా పని చేసిన వీరు జనజీవన స్రవంతిలో కలిశారు. ఈ సందర్భంగా సీపీ సుధీర్ బాబు అజ్ఞాతంలో ఉన్న తెలంగాణ మావోయిస్టులు కూడా తిరిగి గ్రామాలకు రావాలని పోరు వద్దు.. ఊరు ముద్దు అని పిలుపునిచ్చారు. సంజీవ్ ది ప్రస్తుత మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా యాప్రాల్. ఆయన1980 లో సీపీఐ(ఎంఎల్) పీపుల్స్ వార్ లో చేరారు. దండకారణ్యంలో చైతన్య నాట్య మండలిలో పని చేశారు. వివిధ ప్రజా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ గద్దర్ కు ముఖ్య అనుచరుడిగా పని చేశాడు. అనంతరం జననాట్యమండలిని స్థాపించి దేశవ్యాప్తంగా సాంస్కృతిక విప్లవానికి పునాది వేశారు. 2002 లో ఐలాపుర్ లో జరిగిన ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్నాడు.
ఇది కూడా చూడండి: అక్రమ సంబంధం వల్లే హత్య.. చందు నాయక్ హత్య కేసులో సంచలన విషయాలు!
కాగా సంజీవ్ అతని భార్య దీనా లొంగుబాటు సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాచకొండ సీపీ సుధీర్ బాబు అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు జన జీవన స్రవంమతిలోకి రావాలని పిలుపునిచ్చారు. అజ్ఞాతం వీడి తిరిగి గ్రామాలకు వచ్చే మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం పునరావాస పథకంతో పాటు ఇతర సహాయ సహకారాలు అందిస్తోందని ఉపాధి మార్గాలు చూపిస్తోందని చెప్పారు. సంజీవ్ అతని భార్య దీనాపై తల రూ.20 లక్షల రివార్డు ఉందని వీరికి ఆ రివార్డు నగదు ప్రభుత్వం తరఫున అందిస్తామని తెలిపారు. హింసను ప్రేరేపించే సిద్ధాంతాన్ని ప్రజలు తిరస్కరిస్తున్నారని సుదీర్ బాబు తెలిపారు. కొంత మంది వ్యక్తులు ప్రజా సంఘాల ముసుగులో శాంతి భద్రతలకు భంగం కలింగించే రీతిలో వ్యవహరిస్తున్నారని అలాంటి వారిపై పోలీసుల నిఘా కొనసాగుతుందని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సీపీ సుదీర్ బాబు హెచ్చరించారు.
ఇది కూడా చూడండి: తెలంగాణలో అన్నకు ప్రాణదానం చేసిన చెల్లి.. ఈ కథ వింటే కన్నీళ్లు ఆగవు!
Also Read : Baloch Liberation Army: పాక్ ఆర్మీపై బలోచ్ లిబరేషన్ భీకర దాడి.. స్పాట్‌లోనే 29 మంది!
medchal-district | Maoists Surrender Before Police | Maoists Surrender | maoists news | maoists-in-india