CM Nitish Kumar : బిగ్ అనౌన్స్మెంట్.. బీహార్ సీఎం సంచలన ప్రకటన !

బీహార్ ఎన్నికలు వేడెక్కుతున్న తరుణంలో  ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురువారం సంచలన ప్రకటన చేశారు. 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. 125 యూనిట్ల లోపు కరెంటు బిల్లులను చెల్లించనక్కర్లేదని వెల్లడించారు.

New Update
cm-nithish-kumar

బీహార్ ఎన్నికలు వేడెక్కుతున్న తరుణంలో  ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురువారం సంచలన ప్రకటన చేశారు. 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. 125 యూనిట్ల లోపు కరెంటు బిల్లులను చెల్లించనక్కర్లేదని వెల్లడించారు. ఆగస్టు 1 నుండి, అన్ని గృహ వినియోగదారులకు మొదటి 125 యూనిట్ల విద్యుత్తుకు ఛార్జీలు చెల్లించకుండా మినహాయింపు ఉంటుందని ఎక్స్ లో  పేర్కొన్నారు. దీని వలన రాష్ట్రంలోని మొత్తం 1 కోటి 67 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు నితీష్.  

కుతిర్ జ్యోతి పథకం కింద అత్యంత పేద కుటుంబాలకు, సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి అయ్యే మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.  మిగిలిన వాటికి ప్రభుత్వం తగిన మద్దతును అందిస్తుంది. దీని అర్థం గృహ వినియోగదారులు ఇకపై 125 యూనిట్ల వరకు విద్యుత్ కోసం ఎటువంటి ఖర్చును భరించాల్సిన అవసరం లేదు. అదే సమయంలో, రాబోయే మూడు సంవత్సరాలలో రాష్ట్రంలో 10,000 మెగావాట్ల వరకు సౌరశక్తి అందుబాటులో ఉంటుందని అంచనా వేయబడింది అని ఆయన వెల్లడించారు.  

సీఎం నితీష్ కుమార్  సంచలన హామీలు

బిహార్‌లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం నితీష్ కుమార్  సంచలన హామీలు ప్రకటిస్తున్నారు.  మళ్లీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని ఇప్పటికే ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. బిహార్‌లో ఈ ఏడాది అక్టోబర్‌, నవంబర్‌ మధ్య ఎన్నికలు జరిగే అవకాశముంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు