/rtv/media/media_files/2025/07/17/pm-kisan-amount-status-check-1-2025-07-17-11-36-10.jpg)
PM Kisan amount status check (1)
దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు గుడ్ న్యూస్ అందింది. ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ డబ్బులను రైతుల ఖాతాల్లో వేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM-KISAN) కింద 20వ విడత నిధులు రేపు, అంటే జూలై 18న రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ బీహార్‌లోని మోతిహారిలో జరిగే బహిరంగ సభలో ఈ నిధులను విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇది కూడా చూడండి: Aadhaar Card: కోట్లల్లో మరణాలు.. ఇంకా యాక్టివ్‌లో ఉన్న ఆధార్ కార్డులు
PM-KISAN
కాగా కేంద్ర ప్రభుత్వం ప్రతీ నాలుగు నెలలకు ఒక సారి ఈ పథకం కింద నిధులను రైతుల ఖాతాల్లోకి వేస్తుంది. గతేడాది జూన్ వాయిదాను నెల ముగియక ముందే రిలీజ్ చేయగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో 19వ విడత నిధులను విడుదల చేశారు. దీని ప్రకారం 20వ విడత జూన్ లో రావాల్సి ఉండగా.. ఈసారి కొంత ఆలస్యం జరిగినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: అక్రమ సంబంధం వల్లే హత్య.. చందు నాయక్ హత్య కేసులో సంచలన విషయాలు!
Annadata sukhibhava
కాగా PM-KISAN ద్వారా దేశవ్యాప్తంగా 9.8 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే కేంద్ర నుంచి PM-KISANతో పాటు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ(Annadata sukhibhava) పథకం కింద తొలి విడత నిధులను విడుదల చేసేందుకు సిద్దమైంది. రెండు పథకాలు ఒకే సారి అమలు చేస్తే రైతుల ఖాతాల్లో రూ.7 వేలు జమ కానున్నాయి. అందులో పీఎం కిసాన్ నుంచి రూ.2 వేలు, రాష్ట్ర ప్రభుత్వ అందిస్తున్న అన్నదాత సుఖీభవ పథకం నుంచి రూ.5000 నేరుగా రైతన్నల ఖాతాల్లోకి జమ కానున్నాయి.
ఇది కూడా చూడండి: తెలంగాణలో అన్నకు ప్రాణదానం చేసిన చెల్లి.. ఈ కథ వింటే కన్నీళ్లు ఆగవు!
లబ్ధిదారులకు సూచనలు:
రైతులు తమ e-KYC ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. ఆధార్ కార్డును బ్యాంకు ఖాతాతో లింక్ చేయాలి. బ్యాంకు ఖాతా వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవడం ముఖ్యం. భూ రికార్డుల్లో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోవాలి.
రైతులు తమ పీఎం కిసాన్ ఖాతా స్టేటస్‌ను అధికారిక వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. దీనికోసం (pmkisan.gov.in) లోని ‘Beneficiary Status’ లేదా ‘Know Your Status’ విభాగంలో తనిఖీ చేసుకోవచ్చు.
ఇది కూడా చూడండి: పాకిస్థాన్‌కు మరింత గడ్డు కాలం.. ఆగిపోయిన నిధులు, టర్కీతో కటీఫ్ !