/rtv/media/media_files/2025/07/16/mumbai-2025-07-16-14-36-06.jpg)
Mumbai
ఈ మధ్య కాలంలో కోపానికి గురై తల్లిదండ్రులు చిన్న పిల్లలను చంపేస్తున్నారు. చిన్న విషయాలకు కూడా ఆగ్రహానికి గురై కనీసం ఒక నిమిషం పాటు కూడా ఆలోచించకుండా పసి పిల్లలను హత్య చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ముంబైలో చోటుచేసుకుంది. నాలుగేళ్ల కూతురు చెప్పిన మాట వినలేదని ఆగ్రహానికి గురై ఓ తండ్రి దారుణంగా గొంతు నులిమి హత్య చేశాడు.
ఇది కూడా చూడండి: Aadhaar Card: కోట్లల్లో మరణాలు.. ఇంకా యాక్టివ్‌లో ఉన్న ఆధార్ కార్డులు
STORY | Man kills stepdaughter in Mumbai, dumps body in sea
— Press Trust of India (@PTI_News) July 15, 2025
READ: https://t.co/rjD4KF2Ylmpic.twitter.com/lEhte9O1lJ
ఇది కూడా చూడండి: TG News: తెలంగాణలో అన్నకు ప్రాణదానం చేసిన చెల్లి.. ఈ కథ వింటే కన్నీళ్లు ఆగవు!
విసిగిస్తుందని కూతుర్ని..
ముంబైకి చెందిన నాజియా అనే మహిళకు ఇమ్రాన్‌షేక్‌తో పెళ్లి జరిగింది. అయితే ఈమె కూతురు ఒక్కసారిగా కనిపించడం మానేసింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సవతి తండ్రి దగ్గర గుర్తించారు. ఆ నాలుగేళ్ల చిన్నారి సవతి తండ్రి దగ్గర తెల్లవారు జామున 3 గంటల వరకు పడుకోకుండా మొబైల్ చూస్తోంది. చెప్పినా వినకపోవడంతో విసుగు చెందిన తండ్రి ఆ నాలుగేళ్ల చిన్నారి గొంతు నులిమి హత్య చేశాడు.
ఇది కూడా చూడండి: పాకిస్థాన్‌కు మరింత గడ్డు కాలం.. ఆగిపోయిన నిధులు, టర్కీతో కటీఫ్ !
ఆ తర్వాత మృతదేహాన్ని సముద్రంలో పడేశాడు. చిన్నారిని హత్య చేసిన తర్వాత సవతి తండ్రి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారిపోయాడు. పరారీలో ఉన్నాడని తేలడంతో వెంటనే పోలీసులు దర్యాప్తు చేపట్టి అదుపులోకి తీసుకుని విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చూడండి: TG Murder: అక్రమ సంబంధం వల్లే హత్య.. చందు నాయక్ హత్య కేసులో సంచలన విషయాలు!
girl | four-years | father