/rtv/media/media_files/2025/07/09/hyd-metro-2025-07-09-12-26-26.jpg)
Hyderabad Metro
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం తలెత్తింది. నాగోల్- రాయదుర్గం మార్గంలో సమస్య రావడంతో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సాంకేతిక లోపాన్ని సరిద్దేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు. మెట్రో రైళ్లో సాంకేతిక లోపం కారణంగా ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఈ సమస్య వల్ల మెట్రో రైళ్లు ఆలస్యంగా నడవడంతోపాటు, రాయదుర్గం స్టేషన్‌లో సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దీనికి తోడు, భారీ వర్షం నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ మరింత పెరిగి స్టేషన్‌లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
Also Read : బీహార్‌లో వింత నాగ పంచమి ఉత్సవం.. విషపు పాములతో ఊరంతా..
సాధారణంగా మెట్రో రైళ్లలో సాంకేతిక సమస్యలు అనేవి చాలా తక్కువ. కానీ, నాగోల్- రాయదుర్గం మధ్య నడిచే మెట్రో మార్గంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో రైళ్ల షెడ్యూల్‌లో ఆటంకం ఏర్పడింది. ఈ కారణంతో రైళ్లు 15 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ సమస్యతో పలువురు ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుక్కొంటున్నారు, మరోవైపు భారీ వర్షం కారణాంగా రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడంతో, చాలా మంది మెట్రోనే ఆశ్రయించారు. అయితే, సాంకేతిక లోపం వల్ల వారి ప్రయాణం మరింత ఆలస్యం కావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇది కూడా చూడండి: Aadhaar Card: కోట్లల్లో మరణాలు.. ఇంకా యాక్టివ్‌లో ఉన్న ఆధార్ కార్డులు
రాయదుర్గం మెట్రో స్టేషన్‌లో సాంకేతిక సమస్యతో టికెటింగ్ విధానం నిలిచిపోయింది. దీంతో టికెటింగ్ కౌంటర్ల వద్ద ప్రయాణికులు బారులు తీరారు. చాలా సమయం వరకు వేచి ఉండాల్సి వచ్చింది. ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులు ఈ ఆలస్యం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ రోజు వర్షం, రైలు ఆలస్యం రెండూ కలిసి ప్రయాణీకులను ఇబ్బంది పెట్టాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చూడండి:పాకిస్థాన్‌కు మరింత గడ్డు కాలం.. ఆగిపోయిన నిధులు, టర్కీతో కటీఫ్ !