/rtv/media/media_files/2025/07/17/virat-kohlui-2025-07-17-06-59-09.jpg)
Virat Kohli: భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీ టీ20, ఇటీవల టెస్టుల నుంచి రిటైర్ అయినప్పటికీ రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాడు. విరాట్ తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడు ఫార్మాట్లలో (టెస్టులు, వన్డేలు, టీ20లు) 900కు పైగా రేటింగ్ పాయింట్లు సాధించిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. తాజాగా ఐసీసీ తన ఆల్ టైమ్ టీ20ఐ రేటింగ్స్‌ను అప్‌డేట్ చేయగా, విరాట్ కోహ్లీ రేటింగ్ 897 నుంచి 909 పాయింట్లకు పెరిగింది. దీంతో అతను మూడు ఫార్మాట్లలోనూ 900+ రేటింగ్ పాయింట్లు సాధించిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. ఇది అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన రికార్డు.
Also Read : అసలు నువ్వు తండ్రేనా.. ఫోన్ చూస్తోందని నాలుగేళ్ల కూతురిని గొంతు నులిమి దారుణంగా..!
విరాట్ కోహ్లీ సాధించిన రేటింగ్ పాయింట్లు:
టెస్టులు: 937 పాయింట్లు (2018లో)
వన్డేలు: 911 పాయింట్లు (2018లో)
టీ20లు: 909 పాయింట్లు
Also Read: పాకిస్థాన్‌కు మరింత గడ్డు కాలం.. ఆగిపోయిన నిధులు, టర్కీతో కటీఫ్ !
కాగా గత ఏడాది ICC T20 ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్ టైటిల్‌ను సాధించిన అనంతరం కోహ్లీ రిటైర్ మెంట్ ప్రకటించాడు. విరాట్ టీ20 125 మ్యాచ్‌లలో 48.69 సగటుతో 4,188 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 25 అర్ధ సెంచరీలున్నాయి. అత్యుత్తమ స్కోరు 122*. ఇక టెస్టుల నుంచి ఇటీవలే కోహ్లీ రిటైర్ అయ్యాడు. భారత్ తరపున అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన నాల్గవ ఆటగాడిగా నిలిచాడు. మొత్తం మీద ఆల్-టైమ్ జాబితాలో 19వ స్థానంలో ఉన్నాడు, 46.85 సగటుతో 9,230 పరుగులు, 30 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలతో కోహ్లి అత్యుత్తమ స్కోరు 254*.
Also Read:తెలంగాణలో ఈ నెల 23న స్కూళ్లు, కాలేజీలు బంద్.. ఎందుకో తెలుసా?
Also Read: TG Murder: అక్రమ సంబంధం వల్లే హత్య.. చందు నాయక్ హత్య కేసులో సంచలన విషయాలు!