/rtv/media/media_files/2025/07/17/vivo-y400-5g-launching-in-india-in-august-2025-07-17-10-48-04.jpg)
Vivo Y400 5G Launching in India in August
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివి తన Vivo Y400 5G ఫోన్‌ను ఆగస్టులో భారతదేశంలో లాంచే చేసే అవకాశం ఉంది. ఇది ఆలివ్ గ్రీన్, గ్లామ్ వైట్ అనే రెండు కలర్ ఆప్షన్లలో రిలీజ్ కానుంది. ఇది మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ అని తెలుస్తోంది. Vivo Y400 5G లాంచ్ తేదీని ఇంకా వెల్లడించలేదు. తాజాగా ఈ ఫోన్ ధర, స్పెసిఫికేషన్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇది కూడా చూడండి: Aadhaar Card: కోట్లల్లో మరణాలు.. ఇంకా యాక్టివ్‌లో ఉన్న ఆధార్ కార్డులు
Vivo Y400 5G
Vivo Y400 5G ధర భారతదేశంలో రూ.20,000 శ్రేణిలోపు ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే వివో గతంలో Vivo Y400 Pro 5G మొబైల్‌ను లాంచ్ చేసింది. దీని 8GB RAM + 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ. 24,999 గా ఉంది. అదే సమయంలో 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999గా కంపెనీ నిర్ణయించింది.
ఇది కూడా చూడండి: అక్రమ సంబంధం వల్లే హత్య.. చందు నాయక్ హత్య కేసులో సంచలన విషయాలు!
Vivo Y400 5G Specifications
Vivo Y400 5Gలో 120Hz రిఫ్రెష్ రేట్‌తో AMOLED డిస్‌ప్లే ఉంటుంది. సెల్ఫీ కెమెరా కోసం హోల్-పంచ్ కటౌట్ కూడా అందించే అవకాశం ఉంటుంది. Vivo Y400 Pro 5G ఫోన్ 6.77-అంగుళాల పూర్తి-HD+ 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. 4,500 nits వరకు పీక్ బ్రైట్‌నెస్, 300Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్‌ను అందిస్తుంది. ఈ ఫోన్‌లో MediaTek Dimensity 7300 చిప్ ఉంటుంది. కెమెరాల కోసం.. ఇది 50-మెగాపిక్సెల్ సోనీ IMX882 ప్రైమరీ లెన్స్‌తో పాటు 2-మెగాపిక్సెల్ షూటర్‌తో డ్యూయల్-రియర్ కెమెరా సెటప్‌ను పొందుతుంది. ముందు భాగంలో 32 -మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను పొందుతుంది.
ఇది కూడా చూడండి: తెలంగాణలో అన్నకు ప్రాణదానం చేసిన చెల్లి.. ఈ కథ వింటే కన్నీళ్లు ఆగవు!
Vivo Y400 Pro 5G కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)-ఆధారిత ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇందులో AI ఫోటో ఎన్‌హాన్స్, AI ఎరేస్ 2.0, AI నోట్ అసిస్ట్, AI ట్రాన్స్‌స్క్రిప్ట్ అసిస్ట్, AI స్క్రీన్ ట్రాన్స్‌లేషన్, AI సూపర్‌లింక్ ఉన్నాయి. ఈ ఫోన్ 90W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.
ఇది కూడా చూడండి: పాకిస్థాన్‌కు మరింత గడ్డు కాలం.. ఆగిపోయిన నిధులు, టర్కీతో కటీఫ్ !