/rtv/media/media_files/2025/07/17/lukkky-2025-07-17-07-13-59.jpg)
Punjab Lottery: అవును లక్కంటే ఇతనిదే.. అదృష్టం మాములుగా తగల్లేదు. జాక్ పాట్ కొట్టేశాడు. రూ. 6 పెట్టి లాటరీ టికెట్ కొంటే ఏకంగా రూ.కోటి తగిలింది. ఇంతకు ఎవరీతను... ఏంటా స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం. మొగా జిల్లాకు చెందిన జస్మాయిల్ సింగ్ ఇటీవల పంజాబ్ రాష్ట్ర లాటరీలో కోటి రూపాయలు గెలుచుకున్నాడు. కేవలం రూ. 6 ఖరీదు చేసే లాటరీ టిక్కెట్‌తో ఈ భారీ మొత్తాన్ని అతను గెలుచుకోవడం విశేషం. జస్మాయిల్ సింగ్ ఒక రోజువారీ కూలీ. ఇటుక బట్టీలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఫిరోజ్‌పూర్ జిల్లాలోని జీరాకు వెళ్లినప్పుడు అతను ఈ లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు.
Also Read:TG Murder: అక్రమ సంబంధం వల్లే హత్య.. చందు నాయక్ హత్య కేసులో సంచలన విషయాలు!
— ETVBharat Punjab (@ETVBharatPB) July 16, 2025
Also Read:తెలంగాణలో ఈ నెల 23న స్కూళ్లు, కాలేజీలు బంద్.. ఎందుకో తెలుసా?
జీవితాన్ని మార్చే ఫోన్ కాల్
కొనుగోలు చేసిన కొన్ని గంటల తర్వాత, అతనికి జీవితాన్ని మార్చే ఫోన్ కాల్ వచ్చింది. ఎందుకంటే అతను సుమారు రూ. 25 లక్షల అప్పుతో బాధపడుతున్నాడు. ఈ డబ్బుతో అప్పు తీర్చాలని అంతేకాకుండా తన పిల్లల (ముగ్గురు పిల్లలు) భవిష్యత్తు కోసం ఉపయోగించాలని జస్మాయిల్ సింగ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ విజయం ఫిరోజ్‌పూర్ జిల్లా నుండి రాష్ట్ర లాటరీ ద్వారా కోటీశ్వరుడైన నాల్గవ వ్యక్తిగా జస్మాయిల్‌ను నిలిపింది. ఈ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిన జాస్మాయిల్ కుటుంబం తమ గ్రామంలో స్వీట్లు పంపిణీ చేస్తూ, డ్రమ్స్ వాయిస్తూ, డాన్స్ చేస్తూ సంబరాలు చేసుకున్నారు. అతని భార్య వీర్పాల్ కౌర్ కూడా అంతే ఆనందాన్ని వ్యక్తం చేసింది: ఈ రోజు మేము ఎప్పుడూ ఊహించలేదు. మేము చాలా సంతోషంగా ఉన్నామని తెలిపారు.
Also Read: పాకిస్థాన్‌కు మరింత గడ్డు కాలం.. ఆగిపోయిన నిధులు, టర్కీతో కటీఫ్ !
Also Read : అసలు నువ్వు తండ్రేనా.. ఫోన్ చూస్తోందని నాలుగేళ్ల కూతురిని గొంతు నులిమి దారుణంగా..!