బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిగ్ షాకిచ్చారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇంఛార్జ్‌గా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నియమించారు. తెలంగాణ భవన్‌లో బుదవారం కేటీఆర్ సింగరేణి కార్మిక సంఘాల సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
✳️ తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారితో ముగిసిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతల సమావేశం
— BRS Party (@BRSparty) July 16, 2025
♦️ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పార్టీకి అనుబంధంగా అనేక కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయం. ఈ దిశగా సింగరేణి ప్రాంతంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు,… pic.twitter.com/76ZGOvHD7t
సింగరేణి ప్రాంతానికి చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు, మాజీ మంత్రులతో సమన్వయం చేసుకుంటూ బొగ్గు గని కార్మిక సంఘం కార్యకలాపాలు నిర్వహించాలన్నారు. సింగరేణి ప్రాంతానికి చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు, మాజీ మంత్రులతో సమన్వయం చేసుకుంటూ బొగ్గు గని కార్మిక సంఘం కార్యకలాపాలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వం ఏ కార్మికుడికైనా అన్యాయం చేస్తే.. చట్టబద్ధంగా ఎదురొనేందుకు లీగల్ సెల్ సహకారం అందిస్తుందని తెలిపారు.
గౌరవ అధ్యక్షురాలిగా కవిత
BRS అనుబంధంగా ఏర్పడిన TBGKSకు గౌరవ అధ్యక్షురాలిగా కవిత ఉన్నారు. అయితే కవితకు చెప్పకుండానే కొప్పుల ఈశ్వర్ నియామకం జరిగినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్‌పై ఇటీవల కవిత సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కవిత వ్యాఖ్యల నేపథ్యంలో ఈశ్వర్ నియామకంపై చర్చ జరుగుతోంది. కేటీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంతో పార్టీలోనే కాకుండా ఆమెకు అనుబంధ సంఘాల్లోనూ ప్రాధాన్యం తగ్గుతోందంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది.