/rtv/media/media_files/2025/07/17/ap-road-accident-2025-07-17-07-16-55.jpg)
AP Road Accident
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతుండగా.. వేగంగా వచ్చిన ఒక కారు మహిళా టీచర్‌ను ఢీకొట్టింది. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే అటువైపుగా వెళ్లిన మంత్రి సత్యకుమార్ యాదవ్ గమనించి ఆమెను తన కారులో హాస్పిటల్‌కు తరలించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇది కూడా చూడండి: Aadhaar Card: కోట్లల్లో మరణాలు.. ఇంకా యాక్టివ్‌లో ఉన్న ఆధార్ కార్డులు
AP Road Accident
కర్నూలు జిల్లాకు చెందిన కె. పద్మావతి (42) గణిత మహిళా టీచర్‌గా గుంటూరు జిల్లా మంగళగిరిలోని విద్యా పరిశోధనా మండలిలో విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం ఆమె తన ఇంటికి వెళ్లేందుకు మరో మహిళతో కలిసి ఆత్మకూరులోని నేషనల్ హైవేపై రోడ్డు దాటింది. అదే సమయంలో విజయవాడ మార్గం నుంచి గుంటూరు వెళ్తున్న ఒక కారు అతి వేగంతో ఆ మహిళా టీచర్‌ను ఢీకొట్టింది.
ఇది కూడా చూడండి: అక్రమ సంబంధం వల్లే హత్య.. చందు నాయక్ హత్య కేసులో సంచలన విషయాలు!
దీంతో ఆమె తలకు తీవ్రంగా గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అదే సమయంలో అటు వైపుగా వెళ్తున్న మంత్రి సత్యకుమార్ యాదవ్.. ఆమెను తన కారులో మంగళగిరి ఎయిమ్స్ వైద్యశాలకు తరలించారు. అయితే అప్పటికే టీచర్ పద్మావతి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక ఈ ప్రమాదానికి కారణమైన నిందితులు కొద్ది దూరంలో కారును ఆపి అక్కడ నుంచి పరారైనట్లు సమాచారం.
ఇది కూడా చూడండి: తెలంగాణలో అన్నకు ప్రాణదానం చేసిన చెల్లి.. ఈ కథ వింటే కన్నీళ్లు ఆగవు!
ఇది కూడా చూడండి: పాకిస్థాన్‌కు మరింత గడ్డు కాలం.. ఆగిపోయిన నిధులు, టర్కీతో కటీఫ్ !