Heart Attack: అయ్యో దేవుడా.. గుండెపోటుతో 9 ఏళ్ల బాలిక మృతి!

ఇటీవలి కాలంలో గుండెపోటుతో చిన్న వయసులోనే మరణిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. దురదృష్టవశాత్తు, ఓ 9 ఏళ్ల బాలిక గుండెపోటుతో మరణించిన విషాద సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.

New Update
rajasthan

Heart Attack: ఇటీవలి కాలంలో గుండెపోటుతో చిన్న వయసులోనే మరణిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. దురదృష్టవశాత్తు, ఓ 9 ఏళ్ల బాలిక గుండెపోటుతో మరణించిన విషాద సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. సికార్‌లోని ఆదర్శ్ విద్యా మందిర్ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న ప్రాచి కుమావత్  అనే బాలిక లంచ్ టైమ్ లో  తన బాక్స్ ను తెరుస్తుండగా అకస్మాత్తుగా స్పృహ కోల్పోయింది. వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించారు. అయితే బాలికను అంబులెన్స్‌లోకి తరలిస్తుండగా ఆమెకు మరోసారి గుండెపోటు వచ్చి అక్కడికక్కడే మరణించింది. ఆమెను బతికించడానికి దాదాపు గంటన్నర పాటు ప్రయత్నించామని  వైద్యుడు డాక్టర్ ఆర్‌కె జాంగిద్  తెలిపారు. 

Also Read : అసలు నువ్వు తండ్రేనా.. ఫోన్‌ చూస్తోందని నాలుగేళ్ల కూతురిని గొంతు నులిమి దారుణంగా..!

Also Read: పాకిస్థాన్‌కు మరింత గడ్డు కాలం.. ఆగిపోయిన నిధులు, టర్కీతో కటీఫ్ !

కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు

ప్రాచి గత రెండు-మూడు రోజులుగా స్వల్ప జలుబు కారణంగా పాఠశాలకు కాలేదని ఆదర్శ్ విద్యా మందిర్ పాఠశాల ప్రిన్సిపాల్ నంద్ కిషోర్ తివారీ తెలిపారు. సోమవారం ఆమె పాఠశాలకు వచ్చినప్పుడు, ఆమె ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించిందన్నారు. బాలిక మృతితో ఆమె కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రాచికి ఎటువంటి తీవ్రమైన లక్షణాలు లేవని, ఆమె ఆకస్మిక మరణం తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని కుటుంబ సభ్యులు అంటున్నారు.   

Also Read:తెలంగాణలో ఈ నెల 23న స్కూళ్లు, కాలేజీలు బంద్.. ఎందుకో తెలుసా?

ఇంత చిన్న వయసులో గుండెపోటు రావడానికి గల కారణాలపై వైద్యులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని అధ్యయనాలు కోవిడ్-19 తర్వాత యువతలో, చిన్నారుల్లో కూడా గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయని సూచిస్తున్నాయి. జీవనశైలి మార్పులు, వాయు కాలుష్యం, ఒత్తిడి, డయాబెటిస్, అతిగా వ్యాయామం, స్టెరాయిడ్స్ వంటివి కూడా కారణాలు కావచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read:TG Murder: అక్రమ సంబంధం వల్లే హత్య..   చందు నాయక్‌ హత్య కేసులో సంచలన విషయాలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు