/rtv/media/media_files/2025/07/17/congress-nri-cell-leader-nangi-devender-reddy-attacked-by-brs-activists-2025-07-17-17-04-45.jpg)
Congress NRI cell leader Nangi Devender Reddy attacked by BRS activists
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ రగడ కొనసాగుతోంది. కాంగ్రెస్ NRI సెల్ నాయకుడు నంగి దేవేందర్ రెడ్డి పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. పోలీసులు ఆయనను తమ రక్షణలో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వివరాల ప్రకారం బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఒక్క గల్ఫ్ బాధిత కుటుంబానికి న్యాయం చేయలేదని కాంగ్రెస్ నాయకులు కొంతకాలంగా విమర్శిస్తున్నారు. దీనిపై నేడు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సొంత గ్రామమైన వేల్పూర్ లో ప్రశాంత్ రెడ్డికి కనువిప్పు పేరిట కాంగ్రెస్ ఓ కార్యక్రమం చేపట్టింది.
Also read : Jammalamadugu : చంపింది అన్నేనా.. గండికోట యువతి మర్డర్ మిస్టరీలో బిగ్ అప్డేట్!
Nangi Devender Reddy Attacked By BRS Activists
కాగా, కాంగ్రెస్ పాలనలో చాలామంది రైతులకు పథకాలు అందలేదని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. పథకాలు అందని రైతులను తీసుకొస్తామని బీఆర్ఎస్ నేతలు సవాల్ చేశారు.ఈ క్రమంలో కాంగ్రెస్ నిర్వహించిన కార్యక్రమం రసాభసాగా మారింది. దీంతో మాటామాటా పెరిగి కాంగ్రెస్ నేత నంగి దేవేందర్ రెడ్డి, బొజ్జ అమరేందర్ రెడ్డిలపై బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అనుచరుల దాడికి దిగారు. ఆయనపై విచక్షణారహితంగా దాడి చేసి అక్కడి నుంచి తరిమి కొట్టారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు గ్రామానికి వచ్చి పరిస్థితిని అదుపుచేశారు. ప్రస్తుతం దేవేందర్ రెడ్డి పోలీసుల రక్షణలో తలదాచుకున్నట్లు సమాచారం. దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
Also Read : Amberpet: మతాంతర వివాహం చేసుకుని.. ఉరేసుకుని నవదంపతులు ఆత్మహత్య
అయితే బీఆర్‌ఎస్ నేతలు మాత్రం మరో విధంగా ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటికి ఎవరి అనుమతి లేకుండా దొంగచాటుగా ప్రవేశించిన వ్యక్తులు, అక్కడ రహస్యంగా వీడియోలు తీయడం జరిగింది. ఈ ఘటనను గమనించిన బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆ వ్యక్తిని నిలదీశారు. ఆ సమయంలో సరైన సమాధానాలు ఇవ్వకుండా పక్కదారి పట్టించడంతో, ఆయన కాంగ్రెస్ అనుబంధిత వ్యక్తిగా గుర్తించబడినాడు. అందుకే ప్రజా ప్రతినిధిని, ఆయన నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని చేసిన ఈ చౌకబారు చర్యకు బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆయనపై దాడి చేశారని చెప్తున్నారు. ఇది వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించడమే కాక, చట్టపరంగా కూడా శిక్షార్హమైన చర్య. ఇలాంటి చర్యలను సరదాగా తీసుకోకుండా, ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. కాబట్టి ఈ అంశాన్ని వక్రీకరించకుండా అసలైన సత్యాన్ని ప్రజలకు తెలిసేలా రాస్తే బాగుంటుందని బీఆర్‌ఎస్ నాయకులు అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also read : Gangraped : కారులో మహిళపై ఏడుగురు గ్యాంగ్ రేప్..11 రోజుల పాటు ఒకరి తరువాత మరోకరు!
Also Read : రెడ్ శారీలో మెరిసిపోతూ అందాలతో కాకరేపుతున్న నిధి.. ఫొటోలు చూస్తే ఫ్లాటే!
crime news | brs-congress | brs-congress-parties | brs vs congress news | BRS vs Congress | congress-leaders | brs-leaders