/rtv/media/media_files/2025/07/17/gandikota-intermediate-student-incident-2025-07-17-12-59-49.jpg)
Gandikota Intermediate Student Incident
ప్రియుడు చంపలేదు..! బలవన్మరణం కాదు..! మరి మైనర్ బాలిక ఎలా చనిపోయింది..? పరువు హత్య ఏమైనా జరిగి ఉంటుందా..? అసలేం జరిగింది.. ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో ఇంటర్ విద్యార్థి హత్య మిస్టరీగా మారింది. బాలికను ప్రియుడు లోకేష్ హత్య చేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా.. అసలు, మైనర్ బాలిక హత్య కేసులో ప్రియుడు లోకేష్ ప్రమేయం లేదని పోలీసులు పేర్కొనడం సంచలనంగా మారింది. అంతేకాకుండా ఆమెపై లైంగిక దాడి కూడా జరగలేదని వెల్లడించారు. గండికోటను పరిశీలించిన ఎస్పీ, డీఐజీ కీలక ఆధారాలు సేకరించారు. అన్ని కోణాల్లో దర్యప్తు ముమ్మరం చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చూడండి: Aadhaar Card: కోట్లల్లో మరణాలు.. ఇంకా యాక్టివ్‌లో ఉన్న ఆధార్ కార్డులు
Gandikota Intermediate Student Incident
సోమవారం ఉదయం 8 గంటల 30 నిమిషాలకు బాలికని గండికోట తీసుకెళ్లిన ప్రియుడు లోకేష్.. 10 గంటల 40 నిమిషాలకి ఒక్కడే వెనక్కి వెళ్లిపోయాడు. బాలిక కాలేజ్‌కి వెళ్లలేదనే విషయం ఇంట్లో తెలిసిందని భయపడి.. తనను అక్కడే వదిలేసి లోకేష్ వెళ్లిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత గండికోటకు బాలిక అన్న సురేంద్ర వెళ్లినట్టు గుర్తించారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: అక్రమ సంబంధం వల్లే హత్య.. చందు నాయక్ హత్య కేసులో సంచలన విషయాలు!
బుధవారం స్పాట్‌కి ఎస్పీతో పాటు వెళ్లిన డీఐజీ ప్రవీణ్ పలు కీలక ఆధారాలు సేకరించి దర్యాప్తు ముమ్మరం చేశామని తెలిపారు. అయితే బాలికపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని తెలిపారు. బాలిక శరీరంపై దుస్తులు లేకుండా పడి ఉండడం వల్ల అఘాయిత్యం జరిగిందని అందరూ భావించారని, అయితే అలాంటిది ఏమీ జరగలేదన్నారు. నిందితుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని డీఐజీ ప్రవీణ్ పేర్కొన్నారు.
ఇది కూడా చూడండి: తెలంగాణలో అన్నకు ప్రాణదానం చేసిన చెల్లి.. ఈ కథ వింటే కన్నీళ్లు ఆగవు!
హత్య ఎలా జరిగిందన్న విషయాన్ని వీలైనంత త్వరగా చేధిస్తామని.. స్పెషల్ టీమ్‌తో పాటు డాగ్ స్వాడ్‌ను రంగంలోకి దింపినట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాదు.. హత్య కేసులో కుటుంబ సభ్యులను సైతం పోలీసులు విచారించనున్నారు. ఎన్నో ట్విస్టులతో హత్యా? లేదా పరువు హత్యా? ఇంకా మిస్టరీగానే గండికోట బాలిక హత్య కేసు కొనసాగుతోంది. బాలికను చంపింది ఎవరనేదానిపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి గండికోటలో సీసీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఇది కూడా చూడండి: పాకిస్థాన్‌కు మరింత గడ్డు కాలం.. ఆగిపోయిన నిధులు, టర్కీతో కటీఫ్ !