Telangana Rain Update: తెలంగాణలో భారీ వర్షం.. ఈ జిల్లాల్లో దంచుడే దంచుడు

తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. యాదాద్రి భువనగిరి, జనగాం, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట ప్రాంతాల్లో భారీగా వర్షపాతం నమోదవుతోంది. రాబోయే కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

New Update
Telangana Rain Update

Telangana Rain Update

గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఓవైపు వర్షం కురుస్తుండగా.. మరోవైపు ఎండలు భగభగమండిపోతున్నాయి. ఏపీలో అక్కడక్కడ చిన్న చిన్న చిరుజల్లులు పడుతుండగా.. తెలంగాణలో ఉరుములు మెరుపులతో వర్షాలు జోరుగా కురుస్తున్నారు. ఇవాళ కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం దంచి కొడుతుంది. 

ఇది కూడా చూడండి: Aadhaar Card: కోట్లల్లో మరణాలు.. ఇంకా యాక్టివ్‌లో ఉన్న ఆధార్‌ కార్డులు

Telangana Rain

తూర్పు, దక్షిణ తుంగభద్రా ప్రాంతం అంతటా వర్షం పడుతుంది. యాదాద్రి భువనగిరి, జనగాం, వరంగల్ గ్రామీణం, మహబూబాబాద్, భద్రాద్రి - కొత్తగూడెం, సూర్యాపేట ప్రాంతాల్లో భారీగా వర్షపాతం నమోదవుతోంది. రాబోయే కొన్ని గంటల్లో మరిన్ని తుంగభద్రా ప్రాంతంలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. 

ఇది కూడా చూడండి: అక్రమ సంబంధం వల్లే హత్య..   చందు నాయక్‌ హత్య కేసులో సంచలన విషయాలు!

జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ లోని కొన్ని ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురవగా.. ఇప్పుడు మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లిలో వచ్చే 2 గంటల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇక హైదరాబాదు ప్రాంతాల్లో మధ్యాహ్నం నుండి వర్షాలు కురుస్తాయని తెలిపింది. 

ఇది కూడా చూడండి:  తెలంగాణలో అన్నకు ప్రాణదానం చేసిన చెల్లి.. ఈ కథ వింటే కన్నీళ్లు ఆగవు!

Advertisment
Advertisment
తాజా కథనాలు