/rtv/media/media_files/2025/07/17/balanagar-durro-dine-industry-fire-accident-2025-07-17-07-41-14.jpg)
balanagar durro dine industry fire accident
హైదరాబాద్‌లోని బాలానగర్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. డ్యూరో డైన్ ఇండస్ట్రీలో దట్టమైన నల్లటి పొగ, ఉవ్వెత్తున పైపైకి ఎగిసిపడుతున్న మంటలతో ఆ ప్రాంతమంతా చికటిగా మారింది. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి 5 పైర్ ఇంజిన్లతో చేరుకుంది. అనంతరం మంటలను అదుపు చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంది.
durro dine industry fire accident
మంటలు ఎక్కువగా ఉండటంతో మరింత కష్టంగా మారింది. అయితే ఈ భారీ అగ్ని ప్రమాదం సమయంలో కంపెనీలో ఎవరూ లేరని సమాచారం. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిస్తోంది. కానీ ఆస్తి నష్టం మాత్రం చాలానే జరిగినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.