/rtv/media/media_files/2025/07/17/india-womens-team-beat-england-by-4-wickets-in-1st-odi-2025-07-17-06-37-29.jpg)
india womens team beat england by 4 wickets in 1st odi
సౌతాంప్టన్ (Southampton) వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత మహిళల జట్టు అద్భుత విజయం (India Win) సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో భారత్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
ఇది కూడా చూడండి: Aadhaar Card: కోట్లల్లో మరణాలు.. ఇంకా యాక్టివ్‌లో ఉన్న ఆధార్ కార్డులు
Indian Women's Cricket
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఇంగ్లాండ్ బ్యాటర్లను కట్టడి చేశారు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో సోఫియా డంక్లీ (83: 92 బంతుల్లో 9 ఫోర్లు), డేవిడ్‌సన్ రిచర్డ్స్ (53) అర్ధశతకాలతో రాణించారు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్ 2, స్నేహ్ రాణా 2, అమన్‌జోత్ కౌర్, శ్రీ చరణి ఒక్కో వికెట్ తీశారు.
ఇది కూడా చూడండి: అక్రమ సంబంధం వల్లే హత్య.. చందు నాయక్ హత్య కేసులో సంచలన విషయాలు!
అనంతరం 259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు 48.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత బ్యాటర్లు సమష్టిగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. భారత జట్టులో దీప్తి శర్మ 64 బంతుల్లో 62 పరుగులు చేసింది. అందులో 3 ఫోర్లు, ఒక సిక్స్ ఉంది. జెమీమా రోడ్రిగ్స్ 54 బంతుల్లో 48 పరుగులు చేసింది. అందులో 5 ఫోర్లు ఉన్నాయి.
ఇది కూడా చూడండి: తెలంగాణలో అన్నకు ప్రాణదానం చేసిన చెల్లి.. ఈ కథ వింటే కన్నీళ్లు ఆగవు!
తృటిలో అర్ధశతకం మిస్ చేసుకుంది. ప్రతీకా రావల్ 36 పరుగులు, స్మృతి మంధాన 28 పరుగులు, హర్లీన్ డియోల్ 27 పరుగులు, హర్మన్ ప్రీత్ కౌర్ 17 పరుగులు, రీచా ఘోష్ 10 పరుగులు, అమన్‌జోత్ కౌర్ 14 బంతుల్లో 20* పరుగులు చేసింది. అందులో 3 ఫోర్లు ఉన్నాయి. ఇంగ్లాండ్ బౌలర్లలో ఛార్లెట్ డీన్ 2, సోఫీ ఎకెల్‌స్టోన్, లారెన్ బెల్, లారెన్ ఫైలర్ ఒక్కో వికెట్ తీశారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యం సాధించింది. ఈ విజయంతో భారత మహిళల జట్టు వన్డే సిరీస్‌ను ఘనంగా ఆరంభించింది.
ఇది కూడా చూడండి: పాకిస్థాన్‌కు మరింత గడ్డు కాలం.. ఆగిపోయిన నిధులు, టర్కీతో కటీఫ్ !