/rtv/media/media_files/2025/07/16/chandu-2025-07-16-12-10-04.jpg)
TG Murder Case: సీపీఐ నేత చందు రాథోడ్ అలియాస్ చందు నాయక్ (50) దారుణ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి(Malakpet Chandu Nayak Gun Firing Incident Updates). మలక్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలోని శాలివాహననగర్ పార్కులో వాకింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తుండగా ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు కళ్లలో కారం చల్లి అనంతరం అతి దగ్గరి నుంచి కాల్పులు జరిపారు. తాజాగా ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మొత్తం 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు కాలపులు జరపగా ఐదుగురు సహకరించినట్టుగా దర్యాప్తులో గుర్తించారు.
Also Read: జూలై 21 నుంచి వర్షాకాల సమావేశాలు.. కీలక బిల్లులు ఇవే
ఎనిమిది రౌండ్ల కాల్పులు
ప్రస్తుతం పోలీసుల అదుపులో నలుగురు నిందితులున్నారు. చందుపై మొత్తం ఎనిమిది రౌండ్ల కాల్పులు జరిపినట్టు గుర్తించారు. పోస్టుమార్టంలో చందు బాడి నుండి 5 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. స్పాట్ లో మరో మూడు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు నిందితుల కోసం పది బృందాల గాలింపు చేపట్టాయి. వివాహేతర సంబంధం కోణంలోనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ హత్యకు భూ వివాదాలే ప్రధాన కారణమని తేలింది. చందు నాయక్ గతంలో భూ వివాదాల్లో కూడా భాగస్వామిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Also Read: భారత్ పై 'నాన్ వెజ్' పాల కుట్ర.. ట్రంప్ ప్లాన్ ను తిప్పికొట్టిన భారత్!
Also Read: నిమిషను క్షమించేది లేదు, ఉరిశిక్ష పడాల్సిందే.. బాధిత కుటుంబం సంచలనం