/rtv/media/media_files/2025/07/17/army-2025-07-17-08-15-43.jpg)
పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) కు రహస్య సైనిక సమాచారాన్ని లీక్ చేశాడనే ఆరోపణలతో పంజాబ్ పోలీసుల రాష్ట్ర ప్రత్యేక ఆపరేషన్ సెల్ (SSOC) ఒక భారత సైనికుడిని అరెస్టు చేసింది. పంజాబ్ పోలీసులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం, నిందితుడిని సంగ్రూర్ జిల్లాలోని నిహల్‌గఢ్ గ్రామానికి చెందిన దేవిందర్ సింగ్‌గా గుర్తించారు. అతన్ని జూలై 14న జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని ఉరి నుండి అరెస్టు చేశారు. గూఢచర్యం ఆరోపణలపై మాజీ ఆర్మీ అధికారి గుర్ప్రీత్ సింగ్ ని గతంలో అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ అరెస్టు జరిగింది. గుర్ప్రీత్ సింగ్‌ను విచారించగా గుర్ప్రీత్ ఫిరోజ్‌పూర్ జైలులో ఉన్నప్పుడు సున్నితమైన ఆర్మీ పత్రాలను పొందడంలో దేవిందర్ ప్రమేయం ఉన్నట్లు తేలింది.
Indian Army soldier arrested from #JammuandKashmir in Pak-linked espionage case
— IndiaToday (@IndiaToday) July 17, 2025
(@KamaljitSandhu)https://t.co/Da0wCMuwZR
ఆరు రోజుల రిమాండ్
ఈ పత్రాలలో రహస్య సమాచారం ఉందని తేలింది. ఆ తరువాత వాటిని పాకిస్తాన్ ఐఎస్ఐకి అందజేశారు. దేవిందర్ సింగ్ అరెస్టు తర్వాత, అధికారులు జూలై 15న అతన్ని మొహాలీ కోర్టు ముందు హాజరుపరిచారు. తదుపరి విచారణ కోసం కోర్టు ఆరు రోజుల పాటు పోలీసు రిమాండ్ విధించింది కోర్టు. 2017లో పూణేలోని ఆర్మీ క్యాంప్‌లో శిక్షణ పొందుతున్న సమయంలో దేవిందర్, గుర్‌ప్రీత్‌లు తొలిసారి కలుసుకున్నారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వారు సంబంధాలు కొనసాగించారని, తరువాత సిక్కిం, జమ్మూ & కాశ్మీర్‌లలో పోస్టింగ్‌లలో కలిసి పనిచేశారని తెలుస్తోంది. వారి సర్వీసులో ఇద్దరికీ రహస్య సైనిక సామగ్రి అందుబాటులో ఉంది, వాటిలో కొన్నింటిని గుర్‌ప్రీత్ లీక్ చేశాడని ఆరోపించారు. గూఢచర్య నెట్‌వర్క్‌లో దేవిందర్ ఖచ్చితమైన పాత్ర ఇంకా దర్యాప్తులో ఉందని అధికారులు తెలిపారు.
Also Read : Amberpet: మతాంతర వివాహం చేసుకుని.. ఉరేసుకుని నవదంపతులు ఆత్మహత్య
Also read : Gangraped : కారులో మహిళపై ఏడుగురు గ్యాంగ్ రేప్..11 రోజుల పాటు ఒకరి తరువాత మరోకరు!