Amberpet: మతాంతర వివాహం చేసుకుని..  ఉరేసుకుని నవదంపతులు ఆత్మహత్య

అంబర్‌పేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మతాంతర వివాహం చేసుకున్న ప్రేమజంట నాలుగు నెలలకే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.  మనస్పర్థలు, ఆర్థిక ఇబ్బందులే వీరి ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది.

New Update
amabarpet

Amberpet: అంబర్‌పేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మతాంతర వివాహం చేసుకున్న ప్రేమజంట నాలుగు నెలలకే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.  మనస్పర్థలు, ఆర్థిక ఇబ్బందులే వీరి ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌ కు చెందిన ఆసియా హసీం ఖాన్‌(29) క్యాటరింగ్‌ పనిచేస్తూ గోల్నాక లక్ష్మీనగర్‌లోని అద్దె ఇంట్లో మూడేళ్లుగా ఉంటుంది. క్యాటరింగ్‌ పనులు చేసే రాజస్థాన్‌కు చెందిన పవన్‌ కుమావత్‌(21) ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇది కాస్త ప్రేమకు దారి తీసింది. నాలుగు  నెలల క్రితం వివాహం చేసుకుని అంబర్‌పేటలో నివాసం ఉంటున్నారు. అయితే కూకట్ పల్లిలో ఉండే పవన్ దంపతులు వీరి వివాహాన్ని వ్యతిరేకించారు. ఈ నెల 10వ తేదీన  వీరిద్దరూ పవన్‌ తల్లిదండ్రుల ఇంటికి వెళ్లారు.

Also Read:TG Murder: అక్రమ సంబంధం వల్లే హత్య..   చందు నాయక్‌ హత్య కేసులో సంచలన విషయాలు!

Also Read : అసలు నువ్వు తండ్రేనా.. ఫోన్‌ చూస్తోందని నాలుగేళ్ల కూతురిని గొంతు నులిమి దారుణంగా..!

ఇంటిని ఖాళీ చేసి వెళ్తామని

అక్కడ వారి మధ్య గొడవలు జరిగాయి.  దీంతో అక్కడినుంచి  ఆసియా హసీం ఖాన్‌ తిరిగి అంబర్ పేట్ కు వచ్చేసింది.  ఈ క్రమంలో  మంగళవారం మధ్యాహ్నం ఇంటి యజమాని పవన్‌ ఫోన్‌ చేసి రెంట్ కట్టాలని కోరాడు. డబ్బులు చెల్లించి ఇంటిని ఖాళీ చేసి వెళ్తామని బదులిచ్చిన పవన్ లక్ష్మీనగర్‌లోని నివాసానికి చేరుకున్నాడు. అయితే అప్పటికే  మనస్పర్థానికి గురైన ఆసియా ఇంట్లోని ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిని గుర్తించిన పవన్ ...  ఆమె డెడ్ బాడీని కిందికి దించాడు. అనంతరం తాను కూడా అదే ఫ్యాన్ కు  చున్నీతో ఆత్మహత్య చేసుకున్నాడు.  బుధవారం రాత్రి స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని మార్చురీకి తరలించారు. స్థానికంగా ఈ ఘటన  కలకలం రేపింది.  

Also Read:తెలంగాణలో ఈ నెల 23న స్కూళ్లు, కాలేజీలు బంద్.. ఎందుకో తెలుసా?

Also Read: పాకిస్థాన్‌కు మరింత గడ్డు కాలం.. ఆగిపోయిన నిధులు, టర్కీతో కటీఫ్ !

Advertisment
Advertisment
తాజా కథనాలు