/rtv/media/media_files/2025/07/09/hca-president-jagan-mohan-rao-arrested-by-cbi-2025-07-09-18-41-10.jpg)
HCA Scam ED enters the fray
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేసులో ఈడీ అడుగుపెట్టింది. హెచ్‌సీఏ పై పీఎంఎల్‌ఏ సెక్షన్ల కింద ఈడీ కేసులు నమోదు చేసింది.గతంలో నమోదైన రెండు హెచ్‌సీఏ కేసులను కలిపి కొత్త ఈసీఐఆర్‌ను తయారు చేసింది. బీసీసీఐ నుంచి వచ్చిన నిధుల విషయంలో మనీలాండరింగ్ జరిగినట్లు అనుమానంతో ఈడీ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. సీఐడీ కస్టడీ ముగిసిన వెంటనే ఈడీ విచారణ ప్రారంభించే అవకాశం ఉంది. ఈసీఐఆర్ లో ఐదుగురిపై కేసులు నమోదు చేసింది. వారిలో జగన్మోహన్ రావు, శ్రీనివాసరావు, రాజేంద్ర యాదవ్, సునీల్ కాంటే, జీ. కవితలు ఉన్నారు.
Also Read : అసలు నువ్వు తండ్రేనా.. ఫోన్ చూస్తోందని నాలుగేళ్ల కూతురిని గొంతు నులిమి దారుణంగా..!
Also Read : Amberpet: మతాంతర వివాహం చేసుకుని.. ఉరేసుకుని నవదంపతులు ఆత్మహత్య
మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై ఫిర్యాదు
మరోవైపు HCA కేసు విషయంలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత తోపాటు మరికొందరిపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ CID, ED కి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం అరెస్ట్ ఐన నిందితుల వెంట ఉండి చక్రం తిప్పిన అసలు దొంగలు తప్పించుకు తిరుగుతున్నారని.. వారిపై కూడా దర్యాప్తు చేయాలని కోరారు. వంకా ప్రతాప్, జాన్ మనోజ్, అర్షద్ ఆయూబ్, సురేందర్ అగర్వాల్, పురుషోత్తం అగర్వాల్ లపై కూడా ఫిర్యాదు చేశారు. HCA లో కోట్ల రూపాయల దుర్వినియోగం తోపాటు.. మనీ ల్యాండరింగ్ జరిగిందని ED కి కూడా ఫిర్యాదు చేశారు TCA సెక్రటరీ గురువా రెడ్డి, ప్రెసిడెంట్ యెండల లక్ష్మీనారాయణ. ఇప్పటికే ED కూడా CID కి లేఖ రాసింది. HCA కేసులో పూర్తి వివరాలను తమకు ఇవ్వాలని CID ని కోరింది ED. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే.. HCA కేసులో మరిన్ని అరెస్ట్ లు జరిగేలా ఉన్నాయి. ఈ కేసులో మరికొన్ని అరెస్ట్ లు తప్పేలా లేవు. HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుతోపాటు.. ట్రెజరర్ శ్రీనివాస రావు, సీఈఓ సునీల్ కాంటే, శ్రీ చక్ర క్లబ్ ప్రెసిడెంట్ కవిత, క్లబ్ జనరల్ సెక్రెటరీ రాజేందర్ యాదవ్ లను అరెస్ట్ చేసిన సీఐడీ వారిని విచారిస్తోంది.
Also read : Gangraped : కారులో మహిళపై ఏడుగురు గ్యాంగ్ రేప్..11 రోజుల పాటు ఒకరి తరువాత మరోకరు!
Also read : Gangraped : కారులో మహిళపై ఏడుగురు గ్యాంగ్ రేప్..11 రోజుల పాటు ఒకరి తరువాత మరోకరు!
Enforcement Directorate | brs-mla-ktr | brs mlc kavitha | hyderabad-cricket-association | scam