Salman Khan: రూ. 5.35 కోట్లకు ఇల్లు అమ్మేసిన సల్మాన్ ఖాన్!

స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన ఆస్తుల నిర్వహణలో భాగంగా ముంబైలో బాంద్రా వెస్ట్ లో ఉన్న తన ఫ్లాట్ ని విక్రయించారు. రూ. 5.35 కోట్లకు సల్మాన్ ఈ ఆస్తిని విక్రయించినట్లు తెలుస్తోంది.

New Update
Salman Khan,

Salman Khan

స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన ఆస్తుల నిర్వహణలో భాగంగా ముంబైలో బాంద్రా వెస్ట్ లో ఉన్న తన ఫ్లాట్ ని విక్రయించారు. రూ. 5.35 కోట్లకు సల్మాన్ ఈ ఆస్తిని విక్రయించినట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం.. శివ్ ఆస్థాన్ హైట్స్ అనే అపార్ట్మెంట్స్ లో ఈ ఫ్లాట్ ఉంది. దీని విస్తీర్ణం దాదాపు 122.45 చదరపు మీటర్లని తెలుస్తోంది. ఈ ప్లాట్ తో పాటు మూడు కార్లు పార్కింగ్ చేసుకునే స్థలం కూడా ఉందట. 

Also Read : సిరియాకు చుక్కలు చూపిస్తోన్న ఇజ్రాయిల్.. దాడులకు 8 ప్రధాన కారణాలివే!

సల్మాన్ భారీ డీల్

ఈ డీల్‌కు సంబంధించి, రూ. 32.01 లక్షల స్టాంప్ డ్యూటీ,  రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇదంతా కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే చెల్లించినట్లు తెలుస్తోంది.  ముంబైలోని రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో బాంద్రా వెస్ట్ అత్యంత ప్రీమియం ప్రాంతాలలో ఒకటిగా పేరుగాంచింది. ఇది లగ్జరీ అపార్ట్‌మెంట్‌లు, హెరిటేజ్ హోమ్స్,  కమర్షియల్ పర్పస్ ప్రదేశాలకు ప్రసిద్ధి.  ఈ ప్రాధాన్యత కారణంగానే ఇక్కడ ఆస్తులకు మంచి విలువ ఉంటుంది. ఇప్పుడు సల్మాన్ కూడా భారీ డీల్ కి తన ఫ్లాట్ ని సేల్ చేసినట్లు సమాచారం. 

ఇది కూడా చదవండి: చియా విత్తనాల నీరుతో బరువుకు చెక్.. ఈ సులభమైన మార్గాలను పాటించండి

Also Read : పాక్‌ ఆర్మీపై విరుచుకుపడుతున్న బలోచ్ లిబరేషన్.. స్పాట్‌లోనే 29 మంది!

'భజరంగీ భాయిజాన్' సీక్వెల్

ఇదిలా ఉంటే సల్మాన్ ప్రస్తుతం  2015లో భారీ విజయం సాధించిన  'భజరంగీ భాయిజాన్' సినిమా  సీక్వెల్ కు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని సల్మాన్ స్వయంగా ధ్రువీకరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మొదటి సినిమా థీమ్, ఎమోషన్స్‌ను కొనసాగిస్తూనే, ఇదొక విభిన్న చిత్రంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Also Read: Allu Arjun: ఫ్యామిలీ మ్యాన్ గా మారిన పుష్పరాజ్.. అమెరికాలో అయాన్, అర్హతో అల్లరి! ఫొటోలు చూశారా

cinema-news

Advertisment
Advertisment
తాజా కథనాలు