/rtv/media/media_files/2025/07/17/women-tied-to-pillar-for-extramarital-affair-in-mogallu-village-2025-07-17-09-31-28.jpg)
Women tied to pillar for extramarital affair In Mogallu village
ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లులో మరో వివాహేతర సంబంధం బయటపడింది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని.. భార్య, ఆమె బంధువులు ఓ ఓ మహిళను స్తంభానికి కట్టేసి చితకబాదిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.
అందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధిత మహిళను భీమవరం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మహిళపై దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇది కూడా చూడండి: Aadhaar Card: కోట్లల్లో మరణాలు.. ఇంకా యాక్టివ్‌లో ఉన్న ఆధార్ కార్డులు
మహిళను స్తంభానికి కట్టేసి
సుబ్బారావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు మోగల్లు గ్రామంలో నివాసముంటున్నారు. సుబ్బారావు అదే గ్రామానికి చెందిన మరో ఒంటరి మహిళతో ఎఫైర్ పెట్టుకున్నాడు. రెండు నెలల క్రితం పక్క మండలమైన అత్తిలిలో అద్దెకు ఇల్లు తీసుకుని ఆమెతో సహజీవనం సాగిస్తున్నాడు. అక్కడితో ఆగకుండా దుబాయ్‌లో ఉన్న తన కుమారుడు పంపించిన డబ్బులు, ఇతర ఆస్తి పత్రాలు మొత్తం ఆమెకు ఇవ్వడంతో భార్య, భర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి.
ఇది కూడా చూడండి: అక్రమ సంబంధం వల్లే హత్య.. చందు నాయక్ హత్య కేసులో సంచలన విషయాలు!
దీంతో దంపతులిద్దరూ గత కొంత కాలంగా గొడవలు పడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే సుబ్బారావు కుటుంబ సభ్యులు, పెద్దలు అనేకసార్లు అతడి మందలించారు. అయితే సుబ్బారావులో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో విసిగిపోయిన భార్య, కుటుంబ సభ్యులు బుధవారం అత్తిలికి వెళ్లారు. అక్కడ అద్దె ఇంట్లో ఉంటున్న భర్త సుబ్బారావుని, ఒంటరి మహిలను గ్రామానికి తీసుకొచ్చారు.
ఇది కూడా చూడండి: తెలంగాణలో అన్నకు ప్రాణదానం చేసిన చెల్లి.. ఈ కథ వింటే కన్నీళ్లు ఆగవు!
అనంతరం ఊరిలోని గుడి వద్ద ఉన్న స్తంభానికి ఆ ఒంటరి మహిళను కట్టేసి చితకబాదినట్లు సమాచారం. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో.. వారు గ్రామానికి చేరుకుని ఆ మహిళను విడిపించి హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం ఈ ఘటనకు పాల్పడిన సుబ్బారావు భార్యతో సహా మరికొందరిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇది కూడా చూడండి: పాకిస్థాన్‌కు మరింత గడ్డు కాలం.. ఆగిపోయిన నిధులు, టర్కీతో కటీఫ్ !