Telangana Villages : బిగ్ షాక్.. తెలంగాణలోని 14 గ్రామాలు మహారాష్ట్రలో విలీనం !

మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని 14 గ్రామాలు మహారాష్ట్రలో విలీనం కావాలనే అంశంపై మహారాష్ట్ర అటవీశాఖ మంత్రి చంద్రశేఖర్ బావన్కులే కీలక ప్రకటన చేశారు.

New Update
telangana-villages

మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని 14 గ్రామాలు మహారాష్ట్రలో విలీనం కావాలనే అంశంపై మహారాష్ట్ర అటవీశాఖ మంత్రి చంద్రశేఖర్ బావన్కులే కీలక ప్రకటన చేశారు.  14 గ్రామాలను తమ రాష్ట్రంలో విలీనం చేసే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని, ఆ గ్రామాల రెవెన్యూ రికార్డులు తమ వద్ద ఉన్నాయని మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బవాంకులే అన్నారు. 14 గ్రామాల ప్రజలు మహారాష్ట్రకు చెందిన ఓటర్లని, వారు మహారాష్ట్రలోనే ఓటు వేస్తారని ఆయన అన్నారు.

కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు

ఈ గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేసుకోవడానికి తమ ప్రభుత్వం సుముఖంగా ఉందన్న మంత్రి ..  ఈ గ్రామస్తుల డిమాండ్లను తాము పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ గ్రామాలు మహారాష్ట్ర సరిహద్దుకు దగ్గరగా ఉండటం వల్ల వారికి రోజువారీ అవసరాలకు, విద్య, వైద్యం వంటి వాటికి మహారాష్ట్రలోని పట్టణాలపైనే ఆధారపడాల్సి వస్తుంది. విలీనం వల్ల ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని గ్రామస్తులు ఆశిస్తున్నారు.ఈ గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేయాలనే అభ్యర్థనపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని బావన్కులే సూచించారు.

ఇది కేవలం రెండు రాష్ట్రాల మధ్యనే కాకుండా, కేంద్ర ప్రభుత్వం ఆమోదం కూడా అవసరమయ్యే సంక్లిష్ట ప్రక్రియ అని తెలిపారు.   ఈ ప్రకటనతో ఈ 14 గ్రామాల విలీనం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. భవిష్యత్తులో ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు