🔴Live News Updates: కాళేశ్వరం విచారణలో బిగ్ ట్విస్ట్.. కేసీఆర్, హరీష్‌రావుకు కమిషన్‌ క్లీన్‌చిట్?

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
LIVE BLOG

Live News Updates

🔴Live News Updates: 

RCB VS KKR: జోష్ మళ్ళీ మొదలు..ఈరోజు నుంచి ఐపీఎల్ రీస్టార్ట్

ఐపీఎల్ మొదలైన దగ్గర నుంచి ఒక్క కరోనా టైమ్ లో రెండేళ్లు తప్ప ఎప్పుడూ ఆగింది లేదు. ఆ తరువాత కూడా ఐపీఎల్ కు అంతరాయం కలుగుతుందని ఎవరూ ఊహించలేదు...క్రికెటర్లతో సహా. కానీ అనూహ్యంగా భారత్, పాక్ వార్ కారణంగా ఈసారి ఐపీఎల్ అర్థాంతరంగా ఆపాల్సి వచ్చింది. ఉద్రిక్త పరిస్థితుల నడుమ, ఆటగాళ్ళు సేఫ్టీ కోసం మ్యాచ్ లను కొనసాగించకూడదని బీసీసీఐ నిర్ణయించింది. అయితే ఇప్పుడు మళ్ళీ పరిస్థితులు చక్కబడడం...యుద్ధం ఆగిపోవడంతో మళ్ళీ మొదలెట్టాలని నిర్ణయించింది. ఈరోజు నుంచే ఐపీఎల్ 18 సీజన్ మళ్ళీ తిరిగి ప్రారంభం కానుంది. ముందు కొన్ని మ్యాచ్ లు అయిపోగా..ఇంకా 13 లీగ్ మ్యాచ్ లు, నాలుగు ప్లే ఆఫ్స్, ఒక ఫైనల్ మిగిలి ఉన్నాయి. ఇప్పటికే జరిగిన మ్యాచ్ లలో మూడు ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నాయి. ఇప్పుడు నాలుగు స్థానాల కోసం మిగతా ఏడు జట్లు పోటీ పడనున్నాయి. 

Also Read :  ఆల్కహాల్ బ్రాండ్ కి బాలయ్య యాడ్.. పద్మ భూషణ్ తిరిగి ఇవ్వాలంటూ నెటిజన్ల ట్రోలింగ్! వీడియో వైరల్

ఆర్సీబీ VS కోలకత్తా నైట్ రైడర్స్..

ఈరోజు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, కోలకత్తా నైట్ రైడర్స్ ఢీకొనబోతున్నాయి. సొంతగ్రౌండ్ లో కనుక ఆర్సీబీ ఈరోజు మ్యాచ్ గెలిస్తే అధికారికంగా ప్లే ఆఫ్స్ లోకి అడుగుపెడుతుంది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఇప్పటికి 11 మ్యాచ్ లు ఆడి 16 పాయింట్లతో టాప్ లో ఉంది. మరోవైపు కోలకత్తా 12 మ్యాచ్ లు ఆడి 11 పాయింట్లతో ఉంది. అయితే ఇవాల్టి నుంచి జరగనున్న మ్యాచ్ లు అన్నీ చాలా కీలకం. ఎందుకంటే లీగ్ కు బ్రేక్ పడడంతో చాలా మంది వారి వారి దేశాలకు వెళ్ళిపోయారు. అందులో ఇప్పుడు మ్యాచ్ లు ఆడ్డానికి రావడం లేదు. దీని ప్రభావం మ్యాచ్ లు, జట్ల మీద గట్టిగానే పడనుంది. 

Also Read : ఐస్ క్రీంలో బల్లి తోక.. కట్ చేస్తే రూ.50,000 ఫైన్ - వీడియో చూశారంటే?

ఆర్సీబీలో హేజిల్ వుడ్ మళ్ళీ వస్తున్నా...అతను లీగ్ ఆడ్డానికి ముందే గాయపడి ఉన్నాడు. అందుకే ఇప్పుడు అతను జట్టులో చేరతాడా లేదా అనేది స్పష్టత లేదు.  ఆల్ రౌండర్ బెతెల్ అందుబాటులో లేడు. సాల్ట్, ఎంగిడి, డేవిడ్, లివింగ్‌స్టన్, షెఫర్డ్‌ ఆ జట్టుతో చేరారు. గాయంతో బాధ పడుతున్న కెప్టెన్‌ రజత్‌ పాటీదార్‌ కోలుకుని ఈ మ్యాచ్‌లో ఆడబోతుండడం ఆర్సీబీకి ఉపశమనమే. ఇక కోలకత్తా జట్టులోని మొయిన్ ఆలీ ఆడటం లేదు. అయితే కీలక ఆటగాళ్ళు మొయిన్‌ అలీ సేవలను కోల్పోయింది. కానీ నరైన్, రసెల్, గుర్బాజ్‌ లు మాత్రం అందుబాటులోనే ఉండడం ఆ జట్టుకు ప్లస్. ఈ మ్యాచ్ కోలకత్తాకు చావో రేవో అన్నట్లే. ఈ మ్యాచ్ గెలవడం ఆ జట్టుకు చాలా ముఖ్యం. మరోవైపు మ్యాచ్ కు వర్షం వల్ల కూడా అంతరాయం ఉండొచ్చని వాతావరణశాఖ చెబుతోంది.

Also Read : నవంబర్‌లో కుప్పకూలనున్న మోదీ సర్కార్.. ?

Also Read : హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!

  • May 17, 2025 21:35 IST

    కాళేశ్వరం విచారణలో బిగ్ ట్విస్ట్.. కేసీఆర్, హరీష్‌రావుకు కమిషన్‌ క్లీన్‌చిట్?

    కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. రాజకీయ నేతలను బహిరంగ విచారణకు పిలవాల్సిన అవసరం లేదని కమిషన్ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో కేసీఆర్,హరీశ్,ఈటలె రాజేందర్ లకు క్లీన్ చీట్ ఇచ్చినట్లేనని తెలుస్తోంది.

    Kaleshwaram investigation
    Kaleshwaram investigation

     



  • May 17, 2025 21:12 IST

    చంద్రునిపై న్యూక్లియర్ పవర్‌ ప్లాంట్‌.. రష్యా-చైనా డీల్

    చంద్రునిపై ఏకంగా ఆటోమేటేడ్ న్యూక్లియర్‌ ప్లాంట్‌ను నిర్మించాలని చైనా, రష్యా ప్రణాళికలు వేస్తున్నాయి. ఈ మేరకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కూడా కుదిరింది. 2035 నాటికి ప్లాంట్‌ నిర్మాణం పూర్తి చేయనున్నట్లు సమాచారం.

    China and Russia plan to build nuclear power station on moon
    China and Russia plan to build nuclear power station on moon

     



  • May 17, 2025 20:24 IST

    తాళి కట్టిన 15 నిమిషాలకే పెళ్లికొడుకు మృతి!

    కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. వధువు మెడలో తాళి కట్టిన  15 నిమిషాలకే పెళ్లి మండపంలో వరుడు గుండెపోటుతో కుప్పకూలి మృతిచెందాడు. ఈ హృదయ విదారకమైన ఈ సంఘటన కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలోని జామ్‌ఖండి పట్టణంలో జరిగింది.

    Groom heart attack
    Groom heart attack

     



  • May 17, 2025 18:36 IST

    తెలంగాణలో భారీ జాబ్ మేళా.. 80 కంపెనీల్లో 5 వేల జాబ్స్..

    నిరుద్యోగులకు బంపర్ ఆఫర్. సింగరేణి సంస్థ సహకారంతో మే 24న ఖమ్మం వైరాలో మేగా జామ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తెలిపారు. 80 సంస్థలు, 5000 ఉద్యోగాలకు సంబంధించి పోస్టర్ రిలీజ్ చేశారు. స్కానర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి. 

    job mela
    job mela Photograph: (job mela)

     

     



  • May 17, 2025 17:36 IST

    పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి.. ఎంపీ డిమాండ్

    పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని రాజ్యసభ ఎంపీ కపిల్‌ సిబల్ కేంద్రానికి సూచించారు. ఇందుకోసం చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA)లో సవరణలు చేయాలన్నారు. ఉగ్రవాదాన్ని పెకలించేసేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవాలన్నారు.

    Rajya Sabha MP Kapil Sibal
    Rajya Sabha MP Kapil Sibal

     



  • May 17, 2025 17:19 IST

    వర్షిణి కావాలి.. జైలులో పూజలు చేస్తున్న అఘోరీ!

    ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న అఘోరి వర్షిణి కోసం జైలు అధికారులతో ప్రతి రోజూ గొడవకు దిగుతున్నట్లుగా సమాచారం. వర్షిణిని కలిపించాలంటూ రచ్చ రచ్చ చేస్తుందట ఆఘోరీ. ఇక  జైలులోనూ అఘోరీ పూజలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.  

    varshinni



  • May 17, 2025 15:58 IST

    RBI సంచలన ప్రకటన.. మార్కెట్ లోకి కొత్త రూ. 20 నోటు..మరీ పాతవి చెల్లవా?

    దేశంలో కొత్త కరెన్సీ నోట్లు అందుబాటులోకి రానున్నాయి. మహాత్మా గాంధీ కొత్త సిరీస్‌ కింద రూ. 20 నోట్లను రిలీజ్ చేయనున్నట్లుగా ఆర్బీఐ శనివారం ఓ ప్రకటనను రిలీజ్ చేసింది. వాటిపై కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుంది. పాత నోట్ల లాగే కొత్త నోట్లు ఉంటాయి.

    rbi-20-note



  • May 17, 2025 15:39 IST

    పాకిస్థాన్ స్పై గా ఇండియన్ యూట్యూబర్.. మొత్తం ఆరుగురు అరెస్ట్! ఆ రాష్ట్రాల్లో వీరి నెట్ వర్క్

    పాకిస్థాన్ గూఢచారులకు దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్న ఆరోపణలతో హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా, మరో ఆరుగురిని అరెస్టు చేశారు. వీరి నెట్ వర్క్ భారతదేశంలోని హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

    youtuber Jyoti Malhotra working as spy to Pakistani intelligence
    youtuber Jyoti Malhotra working as spy to Pakistani intelligence

     



  • May 17, 2025 15:03 IST

    ట్రంప్ పరువు పోయింది.. అమెరికా చరిత్రలోనే తొలి దారుణ పరాభవం

    అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికాకు ఊహించని షాక్ తగిలింది. అమెరికా సావరిన్ క్రెడిట్ రేటింగ్‌ను మూడీస్ శుక్రవారం తగ్గించింది. పెరుగుతున్న జాతీయ రుణం, ఆర్థిక అస్థిరతపై ఆందోళనలను ఉటంకిస్తూ క్రెడిట్ రేటింగ్ ను ట్రిపుట్‌ ఎ (AAA) నుండి ఎఎ 1 (AA1) కు తగ్గించింది.

    donald-trump rating



  • May 17, 2025 14:17 IST

    Tamannaah VVAN Movie Poster: వణుకు పుట్టిస్తున్న తమన్నా కొత్త మూవీ పోస్టర్..

    తమన్నా భాటియా మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అడవి నేపథ్యంలో మిస్టరీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ‘VVAN – Force of the Forest’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను సోషల్ మీడియా లో అభిమానులతో పంచుకుంది తమన్నా.

    Tamannaah VVAN Movie Poster
    Tamannaah VVAN Movie Poster

     



  • May 17, 2025 13:14 IST

    Dadasaheb Phalke Biopic: రాజమౌళికి బిగ్ షాక్.. ఆ సినిమా ఆగిపోయినట్టే..!

    దాదాసాహెబ్ ఫాల్కేపై రెండు బయోపిక్స్ తెరకెక్కుతున్నాయి. అయితే ఫాల్కే మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ పుసల్కర్ SS రాజమౌళి తీస్తున్న "Made in India"పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. అలాగే ఆమిర్ ఖాన్, రాజ్‌కుమార్ హిరాని ప్రాజెక్ట్‌పై మాత్రం ప్రశంసలు కురిపించాడు.

    Dadasaheb Phalke Biopic
    Dadasaheb Phalke Biopic

     



  • May 17, 2025 12:07 IST

    ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి పొన్నం.. ప్రయాణికులతో ముచ్చట్లు-PHOTOS

    మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సందడి చేశారు. పంజాగుట్ట నుండి లక్డికపూల్ లోని హైదరాబాద్ కలెక్టరేట్ వరకు మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి బస్సులో ప్రయాణించారు. ప్రయాణికులతో సరదాగా ముచ్చటించారు.



  • May 17, 2025 11:37 IST

    Rohith Sharma: ఎమోషనల్ అయిన రోహిత్ తల్లిదండ్రులు.. భార్య రితిక కూడా ఏడుస్తూ!

    వాంఖడే క్రికెట్‌ స్టేడియంలో ఓ స్టాండ్‌కు రోహిత్ శర్మ పేరు పెట్టడంతో తల్లిదండ్రులు ఎమోషనల్ అయ్యారు. భార్య రితిక కూడా ఏడుస్తూ మామ వెనక్కి వెళ్లి దాక్కోవడానికి ప్రయత్నించారు. దీంతో నెటిజన్లు ఇది కదా పేరెంట్స్‌కి ప్రౌడ్ మూమెంట్ అని కామెంట్‌లు చేస్తున్నారు.

    Rohith Sharma Parents Emotional
    Rohith Sharma Parents Emotional

     



  • May 17, 2025 11:36 IST

    Miss World 2025: క్వార్టర్ ఫైనల్స్ కి వెళ్ళేది ఎవరు? స్టేడియంలో మిస్ వరల్డ్ 2025 స్పోర్ట్స్ ఫైనల్

    మిస్ వరల్డ్ 2025 పోటీదారులు ఈరోజు గచ్చిబౌలి స్టేడియంలో స్పోర్ట్స్ ఫైనల్ లో పాల్గొననున్నారు. ఇక్కడ కంటెస్టెంట్స్ తమ శారీరక సామర్థ్యాలను ప్రదర్శిస్తారు. ఈ ఈవెంట్ ద్వారా కంటెస్టెంట్స్ తమ క్వార్టర్-ఫైనల్స్‌లో స్థానం పొందేందుకు పోటీ పడతారు.

    miss world 2025 sports final  Gachibowli indoor stadium
    miss world 2025 sports final Gachibowli indoor stadium

     



  • May 17, 2025 11:35 IST

    Vijay Devarakonda: విజయ్ దేవరకొండ వాట్సాప్ చాట్ వైరల్! అమ్మ కోసం ఏం చేశాడో చూడండి

    స్టార్ హీరో విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు. అమ్మ, నాన్నతో కలిసి డిన్నర్ కి వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేయడంతో పాటు ''కుదిరితే అందరం డిన్నర్ కి వెళ్దామా?'' అంటూ అమ్మ తనను అడిగిన క్యూట్ వాట్సాప్ చాట్ ను కూడా పంచుకున్నారు విజయ్.

    vijay devarakonda took out his mother for dinner
    vijay devarakonda took out his mother for dinner

     



  • May 17, 2025 11:35 IST

    Bakasura Trailer: షాకయ్యారా.. 'బకాసురా' ట్రైలర్ లో ఉప్పల్ బాలు ఎంట్రీ!

    హాస్య నటులు వైవా హర్ష, ప్రవీణ్, ప్రధాన పాత్రలో రూపొందిన లేటెస్ట్ మూవీ 'బకాసురా రెస్టారెంట్'. తాజాగా చిత్రబృందం మూవీ ట్రైలర్ విడుదల చేశారు. హారర్, కామెడీ ఎలిమెంట్స్ తో సాగిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఈ ట్రైలర్ మీరూ చూసి ఎంజాయ్ చేయండి.

    Bakasura Restaurant_ Official Trailer
    Bakasura Restaurant_ Official Trailer

     



  • May 17, 2025 11:08 IST

    పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐకి ఇన్ఫర్మేషన్ లీక్.. హర్యానా స్టూడెంట్ అరెస్టు

    హర్యానాకు చెందిన దేవేంద్ర అనే విద్యార్థి పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐకి డేటా లీక్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో అన్ని విషయాలను పాక్‌కు తెలియజేశాడని దర్యాప్తులో తేలింది. ఇంటెలిజెన్స్ సమాచారం రావడంతో పోలీసులు దేవేంద్రను అరెస్టు చేశారు.

    Haryana student
    Haryana student

     



  • May 17, 2025 11:07 IST

    Ind-Pak War: ఎరవేసి మరీ పాక్ ను దెబ్బ కొట్టిన భారత్

    పహల్గాందాడి తర్వాత జరిగిన భారత్, పాక్ యుద్ధంలో మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. భారత్  పక్కా వ్యూహంతో పాకిస్తాన్ ను దెబ్బ కొట్టింది. డమ్మీ ఎయిర్ క్రాఫ్ట్ లతో ఎర వేసి..బ్రహ్మోస్ తో దాడి చేసిందని తెలుస్తోంది. 

    india
    Brahmos Missiles

     



  • May 17, 2025 11:07 IST

    Naked Man Mobile Theft: గర్ల్ ఫ్రెండ్ కి గిఫ్ట్ ఇవ్వాలని నగ్నంగా మొబైల్ షాప్‌లోకి దూరాడు.. చివరికి!

    బెంగళూరులో ఓ విచిత్రమైన చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. తన లవర్ కి ఖరీదైన గిఫ్ట్ ఇవ్వాలన్న కోరికతో, ఓ యువకుడు నగ్నంగా మొబైల్ షాప్‌లోకి చొరబడిన సంఘటన పోలీసులను కూడా షాక్‌కు గురిచేసింది.

    Naked Man Mobile Theft
    Naked Man Mobile Theft

     



  • May 17, 2025 10:11 IST

    World's Most Powerful Missile: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిసైల్ ఇదే..! ధర ఎంతంటే?

    RS-28 సార్మాట్ క్షిపణి ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన క్షిపణిగా పేరు తెచ్చుకుంది. రష్యా తయారు చేసిన ఈ అణు క్షిపణి భవిష్యత్తులో గ్లోబల్ డిఫెన్స్ సిస్టమ్‌లో కీలక పాత్ర పోషించనుంది. ఈ క్షిపణిని ప్రయోగించాలంటే మాత్రం బాధ్యతతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

    World's Most Powerful Missile
    World's Most Powerful Missile

     



  • May 17, 2025 10:00 IST

    Houthi-Isreal: హౌతీలకు ఇజ్రాయెల్ హెచ్చరిక.. మీ నాయకుడే మా టార్గెట్

    హౌతీ నియంత్రణలో ఉన్న ఓడరేవులపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడులకు ప్రతీకారంగా హౌతీలు ఎదురు తిరిగితే అబ్దుల్ మాలిక్ అల్-హౌతీని చంపేస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి తెలిపారు. రక్షణ మంత్రి మాటలకు ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సపోర్ట్ చేశారు.

    Houthi-Isreal
    Houthi-Isreal

     



  • May 17, 2025 09:28 IST

    USA: విదేశాలకు పంపే డబ్బుపై పన్ను..అమెరికాలో భారతీయులపై ప్రభావం

    విదేశాలకు పంపే డబ్బు మీద ఐదుశాతం పన్ను విధించాలని ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇది కనుక అమల్లోకి వస్తే అమెరికా నుంచి తమ ఇళ్లకు డబ్బు పంపే ఎన్నారైలపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. ఇది భారతీయులపై కూడా తీవ్ర ప్రభావం చూపించనుంది. 

    money7



  • May 17, 2025 09:26 IST

    Weather Update: దూసుకొస్తున్న నైరుతి రుతుపవనాలు.. ఈ జిల్లాలో భారీ వర్షాలు

    నైరుతి రుతుపవనాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్, ఏపీలో మన్యం, ఏలూరు, కర్నూలులో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.

    Southwest monsoon
    Southwest monsoon

     



  • May 17, 2025 08:20 IST

    ISRO 101st Launch: ఇస్రో మరో ఘనత.. రేపే ప్రయోగం

    ఇస్రో మే 18న RISAT-18 ఉపగ్రహాన్ని PSLV-C61 ద్వారా ప్రయోగించనుంది. శనివారం ఉదయం 7:59కు కౌంట్‌డౌన్ ప్రారంభమై, ఆదివారం ఉదయం 5:59కు శ్రీహరికోట నుంచి ప్రయోగం జరగనుంది. ఇది దేశ భద్రతకు కీలకమైన మిషన్‌గా ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ వెల్లడించారు.

    ISRO 101st Launch
    ISRO 101st Launch

     



  • May 17, 2025 07:23 IST

    RCB VS KKR: జోష్ మళ్ళీ మొదలు..ఈరోజు నుంచి ఐపీఎల్ రీస్టార్ట్

    హమ్మయ్యా...ఐపీఎల్ మళ్ళీ మొదలవుతోంది. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఆగిపోయిన టోర్నీని బీసీసీఐ మళ్ళీ జరిపించాలని నిర్ణయించింది. ఈరోజు ఆర్సీబీ, కోలకత్తా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ తో సీజన్ మొదలవనుంది.

    ipl
    RCB VS KKR

     



  • May 17, 2025 07:22 IST

    Russia-Ukraine: రష్యా వీలు కాని డిమాండ్లు పెడుతోంది.. ఉక్రెయిన్ ఆరోపణ

    ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ ల మధ్యన శాంతి చర్చలు జరుగుతున్నాయి. అయితే వీటిల్లో రష్యా ఆమోదించలేని డిమాండ్లు పెడుతోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. కావాలనే...ఏ పురోగతీ లేకుండానే చర్చలను ముగించాలనే ఉద్దేశంతో రష్యా ఇలా చేస్తోందని అంటోంది. 

    turky
    russia-ukraine peace talks

     



  • May 17, 2025 07:22 IST

    Everest Mountain: ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి.. కొన్ని నిమిషాలకే భారత పర్వతారోహకుడి మృతి

    పశ్చిమ బెంగాల్‌కి చెందిన సుబ్రతా ఘోష్‌ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన కాసేపటికే  చనిపోయాడు. తన గైడ్ చంపల తమంగ్‌తో కలిసి సుబ్రతా ఘోష్ శిఖరాన్ని అధిరోహించారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తిరిగి వస్తుండగా అనారోగ్యానికి గురై మృతి చెందినట్లు తెలుస్తోంది.

    Subrata Ghosh
    Subrata Ghosh

     



Advertisment
Advertisment
తాజా కథనాలు