/rtv/media/media_files/2025/05/17/WaT3nW8LfrdPPyq9dIFq.jpg)
Haryana student
Pakistan Spy Scandal: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు(India Pakistan War) కొనసాగుతున్న సమయంలో పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐకి ఓ విద్యార్థి సమాచారం అందించాడని ఆరోపణలు వచ్చాయి. హర్యానాలోని మస్త్‌గఢ్ చీకా గ్రామానికి చెందిన దేవేంద్ర సింగ్‌గా పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. ఈ 25 ఏళ్ల యువకుడుకు పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలింది.
ఇది కూడా చూడండి: RCB VS KKR: జోష్ మళ్ళీ మొదలు..ఈరోజు నుంచి ఐపీఎల్ రీస్టార్ట్
पंजाब के पटियाला में पढ़ रहे हरियाणा के 25 वर्षीय युवक देवेंद्र सिंह को भारत की जासूसी और संवेदनशील सैन्य जानकारी पाकिस्तानी एजेंसी ISI को देने के आरोप में गिरफ्तार किया गया। हनीट्रैप के जरिए फंसाने का मामला। जांच जारी। #NationalSecurity #honeytrap #ISI pic.twitter.com/ljXJRiPQiJ
— Punjab Kesari-Punjab (@KesariPunjab) May 16, 2025
ఇది కూడా చూడండి: Oppo Reno 14 5G Series: కిర్రాక్ మావా.. అప్పు చేసైనా ఒప్పో కొనేయాల్సిందే - ఫోన్లు అదిరిపోయాయ్!
ఆపరేషన్ సిందూర్ గురించి..
భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన ఉద్రిక్తతల గురించి ఆ యువకుడు ఏజెన్సీకి సమాచారం ఇచ్చాడని తేలడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆపరేషన్ సిందూర్ గురించి ఎప్పటికప్పుడు దేవేంద్ర సింగ్ అందించాడని ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. ఈ క్రమంలోనే ఆ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. దేవేంద్ర సింగ్ పంజాబ్‌లోని ఓ కళాశాలలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుతున్నాడు.
ఇది కూడా చూడండి: Russia-Ukraine: రష్యా వీలు కాని డిమాండ్లు పెడుతోంది.. ఉక్రెయిన్ ఆరోపణ
గతేడాది సింగ్ పాకిస్తాన్‌లోని నంకనా సాహిబ్ గురుద్వారాకు తీర్థయాత్రకు వెళ్లాడు. అక్కడ అతనికి పాకిస్తాన్ నిఘా కార్యకర్తలతో పరిచయం ఏర్పడిందని ఆరోపించారు. అప్పటి నుంచి వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌లోని కొంతమంది వ్యక్తులకు సమాచారం అందించాడనే ఆరోపణలపై హర్యానాలోని పానిపట్‌లో 24 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసిన కొన్ని రోజుల తర్వాత ఈ సంఘటన జరిగింది.
ఇది కూడా చూడండి: Pre-Diabetes: ప్రీడయాబెటిస్, ఊబకాయం ఉన్నవారు కొన్ని పండ్లను ఎందుకు నియంత్రణలో తినాలి