/rtv/media/media_files/2025/05/17/GDoqq1rN1AU36MWVGhoq.jpg)
Tamannaah VVAN Movie Poster
Tamannaah VVAN Movie Poster: మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా సినిమాల జోరు ఏమాత్రం తగ్గడం లేదు. భాష తో సంబంధం లేకుండా బాలీవుడ్, టాలీవుడ్, ఇతర ఇండస్ట్రీలలో కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా మారింది. ఇటీవలే ‘ఓదెల-2’తో(Odela 2) తెలుగు ప్రేక్షకులను మెప్పించిన తమన్నా, ఇప్పుడు హిందీ సినిమాల్లోనూ బిజీగా మారింది.
Also Read: రాజమౌళికి బిగ్ షాక్.. ఆ సినిమా ఆగిపోయినట్టే..!
VVAN - Force of the Forest
ఈ క్రమంలో ఆమె నటిస్తున్న కొత్త హిందీ సినిమా ‘VVAN - Force of the Forest’. అడవి నేపథ్యంలో, జానపద థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అరుణాభ్ కుమార్, దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తుండగా, తమన్నా హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం అడవుల్లో జరుగుతోంది. చిత్ర నిర్మాణ బాధ్యతలను బాలాజీ మోషన్ పిక్చర్స్, టీవీఎఫ్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా చేపట్టాయి.
Also Read: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిసైల్ ఇదే..! ధర ఎంతంటే?
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్‌ను తమన్నా అభిమానులతో షేర్ చేసుకుంది. సినిమా 2026, మే 15న థియేటర్లలో విడుదల కానుందని తెలిపింది. “అడవి గుసగుసలాడుతోంది… 2026 మే 15న ఆ శక్తి విడుదల అవుతుంది. ఈ అడ్వెంచర్‌ను బిగ్ స్క్రీన్‌పై చూడటానికి సిద్ధంగా ఉండండి!” అంటూ షేర్ చేసిన పోస్టర్ పై రాసుకొచ్చింది.
Also Read: అనకాపల్లి మిస్సింగ్ కలకలం.. నాలుగేళ్ల లోహితను ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని మహిళ
ఈ పోస్టర్ ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఓ పాత ఆలయం, చుట్టూ పచ్చని అడవి, భయానకంగా కనిపించే రెండు భారీ కళ్ళు, వాటి మధ్యలో లాంతర్ పట్టుకుని వెళ్తున్న ఓ వ్యక్తి ఈ పోస్టర్ లో కనిపిస్తుండడం తో ఈ సినిమా లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను ఏ లెవెల్ లో ఉంటయో అర్థమవుతోంది.
Also Read : ఆల్కహాల్ బ్రాండ్ కి బాలయ్య యాడ్.. పద్మ భూషణ్ తిరిగి ఇవ్వాలంటూ నెటిజన్ల ట్రోలింగ్! వీడియో వైరల్