Miss World 2025: క్వార్టర్ ఫైనల్స్ కి వెళ్ళేది ఎవరు? స్టేడియంలో మిస్ వరల్డ్ 2025 స్పోర్ట్స్ ఫైనల్

మిస్ వరల్డ్ 2025 పోటీదారులు ఈరోజు గచ్చిబౌలి స్టేడియంలో స్పోర్ట్స్ ఫైనల్ లో పాల్గొననున్నారు. ఇక్కడ కంటెస్టెంట్స్ తమ శారీరక సామర్థ్యాలను ప్రదర్శిస్తారు. ఈ ఈవెంట్ ద్వారా కంటెస్టెంట్స్ తమ క్వార్టర్-ఫైనల్స్‌లో స్థానం పొందేందుకు పోటీ పడతారు.

New Update

Miss World 2025:  72వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలు ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో ఘనంగా జరుగుతున్నాయి. మే 10 నుంచి 31వరకు జరగనున్న ఈ అందాల పోటీల్లో 115కి పైగా దేశాల అందాల భామలు పోటీపడుతున్నారు. కాగా, ఈరోజు మిస్ వరల్డ్ అంతా   కంటెస్టెంట్స్  గచ్చిబౌలి స్టేడియంలో స్పోర్ట్స్ ఫైనల్ లో పాల్గొంటున్నారు. 

క్వార్టర్-ఫైనల్స్‌ కి వెళ్ళేది ఎవరు?

ఇక్కడ కంటెస్టెంట్స్ తమ శారీరక సామర్థ్యాలను ప్రదర్శిస్తారు.  స్పోర్ట్స్ ఫైనల్  పోటీల ద్వారా కంటెస్టెంట్స్  క్వార్టర్-ఫైనల్స్‌లో స్థానం దక్కించుకునేందుకు పోటీ పడతారు. అలాగే కాంటినెంట్ -ఆధారిత టాప్ 10లో స్థానం పొందేందుకు పోటీ పడతారు. పోటీల ప్రారంభానికి ముందు అందాల భామలు యోగా , ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం1 గంట వరకు ఈ స్పోర్ట్స్ ఛాలెంజ్ జరుగుతుంది. 

తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్

అనంతరం సాయంత్రం  5:00 నుంచి రాత్రి 9:00 వరకు  ఎక్స్‌పీరియం ఎకో టూరిజం పార్క్, వేదికగా జరగనున్న  తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ లో పాల్గొంటారు అందాల భామలు. ఈ కార్యక్రమంలో పోటీదారులు రాష్ట్ర వంటకాల రుచులను ఆస్వాదిస్తారు.

miss world 2025 sports final | Miss World 2025 hyderabad 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు