Trump: ట్రంప్ పరువు పోయింది.. అమెరికా చరిత్రలోనే తొలి దారుణ పరాభవం!

అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికాకు ఊహించని షాక్ తగిలింది. అమెరికా సావరిన్ క్రెడిట్ రేటింగ్‌ను మూడీస్ శుక్రవారం తగ్గించింది. పెరుగుతున్న జాతీయ రుణం, ఆర్థిక అస్థిరతపై ఆందోళనలను ఉటంకిస్తూ క్రెడిట్ రేటింగ్ ను ట్రిపుట్‌ ఎ (AAA) నుండి ఎఎ 1 (AA1) కు తగ్గించింది.

New Update
donald-trump rating

అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికాకు ఊహించని షాక్ తగిలింది. అమెరికా సావరిన్ క్రెడిట్ రేటింగ్‌ను మూడీస్ శుక్రవారం తగ్గించింది. పెరుగుతున్న జాతీయ రుణం, ఆర్థిక అస్థిరతపై ఆందోళనలను ఉటంకిస్తూ క్రెడిట్ రేటింగ్ ను ట్రిపుట్‌ ఎ (AAA) నుండి ఎఎ 1 (AA1) కు తగ్గించింది.  అమెరికా తన టాప్ ర్యాంకును కోల్పోవడం చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇది ట్రంప్ పరిపాలనకు పెద్ద ఎదరుదెబ్బ అని చెప్పాలి. మూడీస్ ప్రకటన వలన పెట్టుబడిదారులు అమెరికా తన అప్పులపై అధిక రాబడిని చెల్లించాలని డిమాండ్ చేసే ప్రమాదం లేకపోలేదు.  2011లో  స్టాండర్డ్ అండ్ పూర్స్, 2023లో ఫిచ్ ఏజెన్సీలు ఇలాగే రేటింగ్ లకు కోతలు విధించాయి.  తాజాగా మూడీస్‌ కూడా అమెరికాకు ర్యాంక్‌ను తగ్గించింది.

Also Read :  అనాథ చిన్నారులతో కలిసి మంత్రి సీతక్క భోజనం

Also Read :  కేజ్రీవాల్‌కు బిగ్‌ షాక్.. రెండుగా చీలిన ఆప్‌

9 శాతానికి పెరుగుతుందని అంచనా

ఫెడరల్ లోటు 2024లో జీడీపీలో 6.4 శాతం నుంచి 2035 నాటికి దాదాపు 9 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు హెచ్చరించింది, క్రెడిట్‌ రేటింగ్‌ తగ్గడం వల్ల వ్యాపార సంస్థలు, వినియోగదారులకు రుణ వ్యయాలు పెరుగుతాయని అంతేకాకుండా తనఖా రేట్లు, కారు లోన్లు, క్రెడిట్ కార్డుల వడ్డీపై ప్రభావం పడుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న డొనాల్డ్ ట్రంప్ పన్ను కోతలు, వ్యయ తగ్గింపులను అమలు చేయాలని భావిస్తున్న తరుణంలో మూడీస్‌  నుంచి ఈ ప్రకటన వెలువడటం అనేది పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి.

Also Read :  శశిథరూర్‌కు కాంగ్రెస్ బిగ్ షాక్.. ఆయనకు అవకాశం ఇవ్వకుండా..!

Also Read :  మహిళలకు సీఎం రేవంత్ అదిరిపోయే శుభవార్త!

 america | india | Donald Trump | united-states | US President | telugu-news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు