/rtv/media/media_files/2025/05/17/7ni19qFb57P7mozbvS7R.jpg)
ISRO 101st Launch
ISRO 101st Launch: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మే 18న తన 101వ ఉపగ్రహ ప్రయోగాన్ని చేపట్టనున్నట్టు చైర్మన్ వి. నారాయణన్(V. Narayanan) గురువారం ప్రకటించారు. ఈ ప్రయోగం దేశ భద్రతా అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళిక చేయబడిందని ఆయన వివరించారు.
ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ మాట్లాడుతూ "ఈ ఏడాది జనవరిలో మేము విజయవంతంగా 100వ రాకెట్‌ను శ్రీహరికోట నుండి ప్రయోగించాము. ఇప్పుడు 101వ ఉపగ్రహమైన RISAT-18 ను Polar Satellite Launch Vehicle (PSLV-C61) ద్వారా మే 18న ప్రయోగించబోతున్నాం," అని తెలిపారు.
Also Read : ఆల్కహాల్ బ్రాండ్ కి బాలయ్య యాడ్.. పద్మ భూషణ్ తిరిగి ఇవ్వాలంటూ నెటిజన్ల ట్రోలింగ్! వీడియో వైరల్
మే 18, ఆదివారం ఉదయం RISAT-18 ఉపగ్రహాన్ని PSLV-C61 ద్వారా నింగిలోకి పంపే ఈ మిషన్‌కు కౌంట్‌డౌన్ శనివారం ఉదయం 7:59 గంటలకు ప్రారంభం కానుంది. ఈ కౌంట్‌డౌన్ 22 గంటలపాటు నిరంతరాయంగా సాగుతుంది. అనంతరం ఆదివారం తెల్లవారు జామున 5:59 గంటలకు శ్రీహరికోటలోని శార్ ప్రయోగ కేంద్రం నుండి రాకెట్ నింగిలోకి దూసుకెళ్తోంది.
Also Read : ఐస్ క్రీంలో బల్లి తోక.. కట్ చేస్తే రూ.50,000 ఫైన్ - వీడియో చూశారంటే?
శార్ కేంద్రానికి ఇస్రో చైర్మన్ వి. నారాయణన్
ప్రయోగానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించేందుకు ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ గురువారం శార్ కేంద్రానికి చేరుకున్నారు. మిషన్ విజయవంతం కావడమే లక్ష్యంగా శాస్త్రవేత్తల బృందం దశల వారీగా అన్ని వ్యవస్థల తనిఖీలు పూర్తి చేస్తోంది.
ఈ RISAT-18 ఉపగ్రహం, భూమి పరిశీలనకు సంబంధించినదిగా ఉండగా, ఇది భారతదేశం యొక్క గగనతల పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ సామర్థ్యాలను మరింత మెరుగుపరుస్తుందని చెప్పారు.
Also Read : నవంబర్‌లో కుప్పకూలనున్న మోదీ సర్కార్.. ?
మీడియాతో మాట్లాడిన నారాయణన్, “మా అన్ని మిషన్లు దేశ అవసరాలకు అనుగుణంగా ఉంటాయి. మేము ఏ దేశంతోనూ పోటీ పడదలుచుకోలేదు. మా లక్ష్యం ప్రజల, దేశ భద్రతను కల్పించడమే,” అని స్పష్టం చేశారు.
ఇస్రో సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన 1979లో భారతదేశం తొలి రాకెట్ ప్రయోగాన్ని చేపట్టినట్టు, అప్పటి SLV-3 మిషన్ 98 శాతం విజయం సాధించిందని చెప్పారు. 1980లో దేశానికి మొదటి విజయవంతమైన ప్రయోగం లభించింది అని కూడా పేర్కొన్నారు.
Also Read: Ind-pak War: రేపటితో ముగియనున్న సీజ్ ఫైర్ ఒప్పందం
ఈ ప్రయోగం భారత అంతరిక్ష ప్రయాణంలో మరో మైలురాయిగా నిలవనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశ భద్రత, పర్యావరణ పర్యవేక్షణ అవసరాలను తీర్చడంలో ఈ ప్రయోగం కీలక పాత్ర పోషించనుందని నిపుణులు చెబుతున్నారు.