Russia-Ukraine: రష్యా వీలు కాని డిమాండ్లు పెడుతోంది.. ఉక్రెయిన్ ఆరోపణ

ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ ల మధ్యన శాంతి చర్చలు జరుగుతున్నాయి. అయితే వీటిల్లో రష్యా ఆమోదించలేని డిమాండ్లు పెడుతోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. కావాలనే...ఏ పురోగతీ లేకుండానే చర్చలను ముగించాలనే ఉద్దేశంతో రష్యా ఇలా చేస్తోందని అంటోంది. 

New Update
turky

russia-ukraine peace talks

రష్యా, ఉక్రయెన్ మధ్య యుద్ధం మొదలై మూడేళ్లు అవుతోంది. ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. ఆ యుద్ధాన్ని ముగించాలనే ఉద్దేశంతో ఇరు దేశాలు ప్రస్తుతం  శాంతి చర్చలు చేస్తున్నాయి. అయితే ఈ చర్చల్లో రష్యా తాము ఆమోదించలేని డిమాండ్లను పెడుతోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది.  ఏ విధమైన పురోగతి లేకుండానే నేటి చర్చల నుంచి వెళ్లిపోవాలనే ఉద్దేశంతోనే రష్యా బృందం ఇలా చేస్తోందని అంటోంది. అయితే తాము మాత్రం కాల్పుల విరమణ తక్షణం అమల్లోకి రావడమే లక్ష్యంగా చర్చలు చేస్తున్నామని చెప్పింది. కాల్పుల విరమణను పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే తమ నియంత్రణలో ఉన్న భూభాగం నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలని రష్యా కోరుతోందని తెలిపింది.

మొట్టమొదటిసారిగా శాంతి చర్చలు..

ఇస్తాంబుల్ లో మొట్టమొదటిసారిగా శాంతి చర్చలు జరుగుతున్నాయి. టర్కీ మధ్యవర్తిత్వంతో ఇవి కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్‌ తరఫున రక్షణ మంత్రి రుస్తెమ్‌ ఉమెరోవ్‌ నేతృత్వంలోని బృందం ఇందులో పాల్గొనగా.. రష్యా నుంచి అధ్యక్షుడి ప్రతినిధి వ్లాదిమిర్‌ మెడిన్‌స్కీ పాల్గొన్నారు. అయితే ఈ చర్చలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ కింది స్థాయి అధికారులను పంపించారని అంటున్నారు. ఇటు పుతిన్ కానీ, అటు జెలెన్ స్కీ కానీ శాంతి చర్చలకు రాలేదు. దీంతో ఇవి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ లేవని అంటున్నారు. అయితే ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో చర్చలు జరిపిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ త్వరలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ తో నేరుగా భేటీ అవుతానని చెప్పారు. అంతటితో అయినా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

 today-latest-news-in-telugu | russia | ukraine | peace

 

Also Read: Cricket: ఇంగ్లాండ్ టూర్ కు ఇండియా ఏ స్క్వాడ్ ప్రకటన

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు