/rtv/media/media_files/2025/05/17/iZt2MXPQ1CzC6RsGSKQB.jpg)
China and Russia plan to build nuclear power station on moon
చంద్రునిపై పరిశోధనలు చేసేందుకు ప్రపంచ దేశాలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అమెరికా, చైనా, రష్యా, భారత్, జపాన్ తదితర దేశాల నిరంతరం చంద్రుని రహస్యాలు తెలుసుకునేందుకు పరిశోధనలు చేస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. చంద్రునిపై ఏకంగా ఆటోమేటేడ్ న్యూక్లియర్ ప్లాంట్‌ను నిర్మించాలని చైనా, రష్యా ప్రణాళికలు వేస్తున్నాయి. ఈ మేరకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కూడా కుదిరింది.
Also Read: బ్యాండేజ్ సె*క్స్ చేస్తుండగా భార్య మృతి.. పోలీసుల దర్యాప్తులో ఊహించని ట్విస్ట్!
రష్యాకు చెందిన అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్, చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (CNSA).. మే ప్రారంభంలో ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నాయి. అయితే ఈ ప్లాంట్ ఇంటర్నేషనల్ చంద్రుని పరిశోధన కేంద్రం (ILRS)లో భాగం అవుతుందని ఇరుదేశాలు భావిస్తున్నాయి. 2035 నాటికి ప్లాంట్ నిర్మాణం పూర్తి చేయనున్నట్లు సమాచారం.
చైనా, రష్యా మధ్య అంతరిక్ష సహకారం, సాంకేతిక ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది. అంతేకాదు భవిష్యత్ అంతరిక్ష ఆవిష్కరణకు కూడా ఇది పునాది అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీర్ఘకాలికంగా చంద్రుడిపై పరిశోధనలు చేసేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
Also Read: టర్కీకి ఓవైసీ సీరియస్ వార్నింగ్.. ఆ విషయం గుర్తు పెట్టుకోవాలంటూ.. !
చంద్రుడిని మానవ ఉనికికి పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రోస్కోస్మోస్ వెల్లడించింది. అయితే ఈ ప్లాంట్‌ను మానవ జోక్యం లేకుండానే రోబోలు నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇక రష్యా, చైనా అనేవి సంయుక్తంగా ILRS ప్రాజెక్టును నిర్వహిస్తున్న సంగతి తెలసిందే. చంద్రుని దక్షిణ ధ్రువంపై పరిశోధనలు చేసేందుకు మానవ స్థావరం ఏర్పాటు చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.
Also Read: పాక్ తో భారత్ దౌత్య యుద్ధం.. విదేశాలకు పంపించనున్న ఎంపీలు వీళ్లే!
Also Read: ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్.. 20 మంది మావోయిస్టు నేతలు అరెస్ట్!?
rtv-news | moon