/rtv/media/media_files/2025/05/17/BAqNbqv08zGZYobHgKI1.jpg)
Groom heart attack
కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. వధువు మెడలో తాళి కట్టిన 15 నిమిషాలకే పెళ్లి మండపంలో వరుడు గుండెపోటుతో కుప్పకూలి మృతిచెందాడు. ఈ హృదయ విదారకమైన ఈ సంఘటన కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలోని జామ్‌ఖండి పట్టణంలో జరిగింది. కుంబారేహళ్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ కుర్నే (26)కు అథాని తాలూకాలోని పార్థనహళ్లి గ్రామానికి చెందిన ఒక యువతితో పెళ్లి ఫిక్స్ అయింది. అయితే ప్రవీణ్ వధువు మెడలో తాళికట్టిన 15 నిమిషాలకే ప్రవీణ్ అకస్మాత్తుగా వణుకుతూ ఛాతీ నొప్పిగా ఉందంటూ కిందపడిపోయాడు.
Also Read : బంగ్లాదేశ్ కు బిగ్ షాక్.. మోడీ సర్కార్ సంచలన నిర్ణయం
Bagalkote | ತಾಳಿ ಕಟ್ಟಿದ ಕೆಲವೇ ಕ್ಷಣದಲ್ಲಿ ಹೃದಯಾಘಾತದಿಂದ ವರ ಸಾ* | Sanjevani News
— Sanjevani News (@sanjevaniNews) May 17, 2025
.
.
.
.
.#Sanjevani #SanjevaniNews #SanjevaniKannadaNews #sanjevanidigital #sanjevanivideos #Marriage #HeartAttack #Baglkot #Bride #Newcouple pic.twitter.com/WxXpkKmBwb
Also Read : చంద్రునిపై న్యూక్లియర్ పవర్ ప్లాంట్.. రష్యా-చైనా డీల్
వెంటనే అతని కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ప్రవీణ్ మరణించాడని వైద్యులు ప్రకటించారు. వివాహం జరిగిన 15 నిమిషాల్లోనే, వధువు వితంతువుగా మారడంతో పెళ్లికి వచ్చిన వారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. భర్తతో నిండు నూరేళ్లూ కలిసుండాలని కలలు కన్న ఆ పెళ్లి కూతురు, వారిద్దర్నీ చూసి మురిసిపోయిన కుటుంబీకులు వరుడి మృతితో గుండెలవిసేలా రోదిస్తున్నారు. ప్రవీణ్ కర్ణాటక సైక్లింగ్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీశైల్ కుర్నే పెద్ద కుమారుడు. ప్రవీణ్ ఒక ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్నాడు.
Also Read : రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్న భార్య.. పట్టించిన జూమ్ కాల్.. కోర్టు ట్విస్ట్ అదిరింది!
16 ఏళ్ల బాలుడి మృతి
నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం నికాల్పూర్ లో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన వడ్ల శివ(16) ఈ ఉదయం నిద్రలేవగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అతడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా గుండెపోటుతో అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలుడు ఇటీవల పదో తరగతి ఫలితాల్లో A గ్రేడ్ ఉత్తీర్ణత సాధించాడు. కుమారుడి అకాల మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Also Read : బ్యాండేజ్ సె*క్స్ చేస్తుండగా భార్య మృతి.. పోలీసుల దర్యాప్తులో ఊహించని ట్విస్ట్!
karnataka | groom | heart-attack | telugu-news