Balakrishna: నందమూరి బాలయ్య లిక్కర్ బ్రాండ్ ని ప్రమోట్ చేయడం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇటీవలే మాన్షియన్ హౌస్ సరోగేట్ ప్రకటనలో.. మాన్షియన్ హౌస్ వాటర్ బాటిల్ ని ప్రమోట్ చేస్తూ కనిపించారు. అయితే ఇక్కడ బాలయ్య ప్రమోట్ చేసింది వాటర్ బాటిల్ అయినప్పటికీ.. ఇండైరెక్ట్ ఆ బ్రాండ్ ని ప్రోత్సహించినట్లు అవుతుంది. దీంతో నెటిజన్ల నుంచి విమర్శలు వెలువెత్తుతున్నాయి.
Also Read : హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
ఇదేం పని బాలయ్య
భారతదేశంలో అత్యన్నత గౌరవ పురస్కారం పద్మ భూషణ్ పొందిన తర్వాత ఇలాంటి ప్రకటనలు చేయడం ఏ మాత్రం సరైనది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. సొసైటీలో ఉన్నత స్థానంలో ఉన్న బాలయ్య యువతను చెడగొట్టేలా.. ఆల్కహాల్ బ్రాండ్ ప్రమోట్ చేయడం ఏంటి..? ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
Also Read : ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ.. మైనర్‌ను ప్రేమించి..చెల్లెలు కావాలని...
Padma Bhushan Balakrishna Officially Signs On as Brand Ambassador for ‘Mansion House’.pic.twitter.com/IeeQXvb9fT
— ZAYN 🇮🇳 (@chiruthajsp) May 15, 2025
Also Read : యువకుడి ప్రాణం తీసిన ట్రాన్స్ఫార్మర్.. లైవ్ లోనే ఘోరం ( వీడియో వైరల్)
అయితే లిక్కర్, పొగాకు వంటి ఉత్పత్తులపై నేరుగా ప్రకటనలు చేసేందుకు చట్టపరంగా అనుమతి లేదు. తద్వారా ఇలాంటి బ్రాండ్లు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి 'సరోగేట్ అడ్వర్టైజింగ్' విధానాన్ని ఎంచుకుంటాయి. వాటర్ బాటిల్స్, సోడా వంటి ఇతర ఉత్పత్తుల పేరుతో తమ ప్రాడక్ట్ ని, బ్రాండ్ ని ప్రజల మనసులలోకి తీసుకెళ్తారు. బాలకృష్ణ నటించిన బాలకృష్ణ నటించిన మాన్సన్ హౌస్ యాడ్ కూడా ఇదే తరహాలో ఉంది.
మ్యాన్షన్ హౌస్ అంబాసిడర్‌గా బాలకృష్ణ #NBK #MansionHouse pic.twitter.com/ngcbVwfVaW
— Milagro Movies (@MilagroMovies) May 15, 2025
Also Read : ఇట్స్ అఫీషియల్.. వీరమల్లు డేట్ ఫిక్స్ చేశాడు.. పవర్ స్టార్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా..
telugu-news | cinema-news | latest-news | Balakrishna mansion house add balayya