/rtv/media/media_files/2025/05/17/r6UBG7QuSt57WF0nXYeW.jpg)
World's Most Powerful Missile
World's Most Powerful Missile: ప్రపంచ దేశాలు తమ దేశ రక్షణ సామర్థ్యాలను మరింత శక్తివంతంగా మార్చేందుకు పోటీ పడుతున్న ఈ రోజుల్లో, క్షిపణి సాంకేతికత(Missile Technology) కీలక పాత్ర పోషిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన క్షిపణి ఏదంటే రష్యా రూపొందించిన RS-28 సార్మాట్ (RS-28 Sarmat) క్షిపణి. దీనిని అనేక మంది "సాటన్ II"(Satan II) అని కూడా పిలుస్తున్నారు.
Also Read : ఆల్కహాల్ బ్రాండ్ కి బాలయ్య యాడ్.. పద్మ భూషణ్ తిరిగి ఇవ్వాలంటూ నెటిజన్ల ట్రోలింగ్! వీడియో వైరల్
RS-28 సార్మాట్ - భూమిని కుదిపేసే శక్తి..!
ఈ మిసైల్ దాదాపు 208 టన్నుల బరువు కలిగి ఉంటుంది, దీని పొడవు 35 మీటర్లు. ఇది ఒకేసారి 15 అణు వార్హెడ్లు (Nuclear Warheads) మోయగలదు. దీనిలో ఉపయోగించబడే MIRV (Multiple Independently targetable Reentry Vehicle) టెక్నాలజీ కారణంగా, ఒక్కసారి ప్రయోగిస్తే చాలు ఏన్ని లక్ష్యాల్ని అయినా చేధించగలదు. RS-28 సార్మాట్కు ఉన్న ముఖ్యమైన ప్రత్యేకత ఏమిటంటే, దీని రేంజ్ దాదాపు 18,000 కిలోమీటర్లు. అంటే ప్రపంచంలోని ఏ మూలకైనా ఈ క్షిపణి తాకగలదు. ఇది అమెరికా వంటి దేశాల అంతరిక్ష డిఫెన్స్ సిస్టమ్‌లను కూడా తప్పించుకునే విధంగా రూపొందించబడింది.
Also Read : ఐస్ క్రీంలో బల్లి తోక.. కట్ చేస్తే రూ.50,000 ఫైన్ - వీడియో చూశారంటే?
ఇండియా - పాకిస్తాన్ ఉద్రిక్తతల్లో క్షిపణుల పాత్ర
ఇండియా, పాకిస్తాన్ మధ్య తాజా ఉద్రిక్తతల సమయంలో, భారత్ పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) లోని టెర్రర్ క్యాంపులపై క్షిపణులతో దాడులు జరిపింది. ఈ ఘటన తరువాత, ప్రపంచవ్యాప్తంగా దేశాలు తమ మిసైల్ టెక్నాలజీని బలోపేతం చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
Also Read : నవంబర్‌లో కుప్పకూలనున్న మోదీ సర్కార్.. ?
RS-28 సార్మాట్ ధర ఎంతంటే?
ఈ శక్తివంతమైన క్షిపణి ఖరీదుపై ఖచ్చితమైన సమాచారం లేనప్పటికీ, కొన్ని నివేదికల ప్రకారం ఒక్కో క్షిపణి ఖర్చు సుమారు 35 మిలియన్ అమెరికన్ డాలర్లు (అంటే దాదాపు రూ. 290 కోట్లు)గా అంచనా. అయితే, దీనికి సంబంధించిన రీసెర్చ్, డెవలప్మెంట్, టెస్టింగ్, డిప్లాయ్‌మెంట్ ఖర్చుల మొత్తం 85 బిలియన్ డాలర్లు వరకు ఉంటుంది.
Also Read: Ind-pak War: రేపటితో ముగియనున్న సీజ్ ఫైర్ ఒప్పందం
ఇంత శక్తివంతమైన ఆయుధాలు ఒకవేళ తప్పుడు చేతుల్లోకి వెళ్తే, ప్రపంచానికి పెను ముప్పుగా మారే అవకాశం ఉంది. అందుకే ఈ శక్తులను వినియోగించడంలో జాగ్రత్త అవసరం. కానీ దేశాలు తమ భద్రత కోసం ఇలాంటి ఆయుధాలను అభివృద్ధి చేయడం మాత్రం తప్పదు.