Rohit Sharma Parents Emotional: ఎమోషనల్ అయిన రోహిత్ తల్లిదండ్రులు.. భార్య రితిక కూడా ఏడుస్తూ!

వాంఖడే క్రికెట్‌ స్టేడియంలో ఓ స్టాండ్‌కు రోహిత్ శర్మ పేరు పెట్టడంతో తల్లిదండ్రులు ఎమోషనల్ అయ్యారు. భార్య రితిక కూడా ఏడుస్తూ మామ వెనక్కి వెళ్లి దాక్కోవడానికి ప్రయత్నించారు. దీంతో నెటిజన్లు ఇది కదా పేరెంట్స్‌కి ప్రౌడ్ మూమెంట్ అని కామెంట్‌లు చేస్తున్నారు.

New Update
Rohith Sharma Parents Emotional

Rohith Sharma Parents Emotional

Rohit Sharma Parents Emotional: ముంబైలోని(Mumbai) వాంఖడే క్రికెట్‌ స్టేడియంలో(Wankhede Cricket Stadium) ఓ స్టాండ్‌కు రోహిత్ శర్మ పేరు పెట్టారు. ఈ స్టాండ్‌ను రోహిత్ శర్మ తల్లిదండ్రులు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్(Maharashtra CM Devendra Fadnavis) ఓపెన్ చేశారు. అయితే ఈ సమయంలో రోహిత్ తల్లిదండ్రులు ఎమోషనల్ అయ్యారు. వీరితో పాటు భార్య రితిక(Rohit Sharma Wife Ritika) కూడా ఏడ్చారు. రితిక కళ్లలో కన్నీళ్లు వచ్చిన వెంటనే మామ వెనక్కి వెళ్లి దాక్కునేందుకు ప్రయత్నించింది. దీంతో ఆమె కళ్లలో కన్నీళ్లను ఎవరూ గమించలేకపోయారు. 

ఇది కూడా చూడండి: RCB VS KKR: జోష్ మళ్ళీ మొదలు..ఈరోజు నుంచి ఐపీఎల్ రీస్టార్ట్

ఇది కూడా చూడండి: Oppo Reno 14 5G Series: కిర్రాక్ మావా.. అప్పు చేసైనా ఒప్పో కొనేయాల్సిందే - ఫోన్లు అదిరిపోయాయ్!

మళ్లీ స్టేడియంలో ఆడాలని ఉందని..

ఇదిలా ఉండగా రోహిత్ శర్మ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ (MCA) నుంచి తనకు దక్కిన అరుదైన గౌరవం అని చెప్పాడు. శుక్రవారం ఆ స్టాండ్‌ను ఆవిష్కరించిన సందర్భంగా కుటుంబంతో కలిసి హాజరైన హిట్ మ్యాన్.. వాంఖడే స్టేడియంతో తనకున్న జ్ఞాపకాలను షేర్ చేసుకున్నాడు.  ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కృతజ్ఞతలు. ఇలా స్టాండ్‌కు నా పేరు పెడతారని ఊహించలేదు. వన్డే ఫార్మాట్‌లో వాంఖడే స్టేడియంలో మరోసారి ఆడాలనుందని రోహిత్ తెలిపారు. 

ఏ ఆటగాడికైనా ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలని, దేశానికి సేవ చేయాలని ఉంటుంది. కానీ నాకు వాటన్నింటి కంటే ఇది ఎంతో ప్రత్యేకం. వాంఖడేలో నాకు ఎన్నో గొప్ప జ్ఞాపకాలున్నాయి. ఇందుకు ముంబై క్రికెట్‌ సంఘానికి ధన్యవాదాలు. రెండు ఫార్మాట్ల నుంచి వైదొలిగాను. ఇంకో ఫార్మాట్లో ఆడుతున్నా. మే 21న ఢిల్లీతో ఆడేందుకు ఇక్కడికి వస్తున్నా' అటూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 

ఇది కూడా చూడండి: Russia-Ukraine: రష్యా వీలు కాని డిమాండ్లు పెడుతోంది.. ఉక్రెయిన్ ఆరోపణ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు