Houthi-Isreal: హౌతీలకు ఇజ్రాయెల్ హెచ్చరిక.. మీ నాయకుడే మా టార్గెట్

హౌతీ నియంత్రణలో ఉన్న ఓడరేవులపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడులకు ప్రతీకారంగా హౌతీలు ఎదురు తిరిగితే అబ్దుల్ మాలిక్ అల్-హౌతీని చంపేస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి తెలిపారు. రక్షణ మంత్రి మాటలకు ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సపోర్ట్ చేశారు.

New Update
Houthi-Isreal

Houthi-Isreal

యెమెన్‌లోని హౌతీ నియంత్రణలో ఉన్న ఓడరేవులపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల వల్ల యెమెన్ ఓడరేవులు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. హౌతీ నాయకుడిని చంపుతామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ప్రతిజ్ఞ చేశారు. హౌతీలు మళ్లీ ఇజ్రాయెల్‌పై దాడులకు దిగకూడదన్నారు. ఒకవేళ దాడులు మళ్లీ కొనసాగిస్తే.. అబ్దుల్ మాలిక్ అల్-హౌతీని కూడా టార్గెట్ చేస్తామని హెచ్చరించింది. రక్షణ మంత్రి అన్న మాటలకు ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సపోర్ట్ చేశారు.

ఇది కూడా చూడండి: Oppo Reno 14 5G Series: కిర్రాక్ మావా.. అప్పు చేసైనా ఒప్పో కొనేయాల్సిందే - ఫోన్లు అదిరిపోయాయ్!

ఇది కూడా చూడండి: Russia-Ukraine: రష్యా వీలు కాని డిమాండ్లు పెడుతోంది.. ఉక్రెయిన్ ఆరోపణ

దాడులు చేస్తే మరింత నష్టం కలిగిస్తాం..

మా పైలట్లు ఉగ్రవాదులు రెండు స్థావరాలపై ఇప్పటికే దాడి చేశారు. ఇక హౌతీ దాడులకు పాల్పడితే ఇంకా మరింత నష్టం కలిగిస్తామని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. హౌతీల వెనుక ఇరాన్ ఉందని, హౌతీలు కేవలం ఒక బంటు అని నెతన్యాహు తెలిపారు. దాడులు చేస్తే హౌతీలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఇజ్రాయెల్‌ను కాపాడుకోవడానికి అన్న విధాలుగా తాము చర్యలు తీసుకుంటామని ప్రధాని బెంజమిన్ అన్నారు. 

ఇది కూడా చూడండి: Pre-Diabetes: ప్రీడయాబెటిస్, ఊబకాయం ఉన్నవారు కొన్ని పండ్లను ఎందుకు నియంత్రణలో తినాలి

Advertisment
Advertisment
తాజా కథనాలు