/rtv/media/media_files/2025/05/16/2hIGwxuoyfk13khgjYik.jpg)
Lizard Tail In Ice Cream In Gujarat Ahmedabad
ఈ మధ్య కాలంలో ఏది తిందామన్నా భయమేస్తుంది. ఎందులో ఏ జీవి అవశేషాలు ఉంటాయో.. ఎలాంటి వస్తువులు కనిపిస్తాయో అనే భయంతో చాలా మంది బయట ఆహారాలు తినడమే మానేస్తున్నారు. కొందరు కొన్ని సమయాల్లో తప్పక తింటున్నారు. బిర్యానిలో ఎలుకలు, బ్లేడ్‌లు, బల్లులు, సిగరెట్లు ఇలా చాలానే కనిపించిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది.
AlsoRead :రేషన్ కార్డు ఉన్న వారికి అదిరిపోయే శుభవార్త.. ఒకేసారి 3 నెలల రేషన్!
ఓ మహిళ తిన్న ఐస్ క్రీమ్‌లో బల్లి తోక కనిపించింది. అది చూసిన ఆ మహిళ ఒక్కసారిగా షాక్ అయింది. ఈ విషయం తెలిసిన కొద్ది క్షణాల్లోనే ఆ మహిళ తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో హాస్పిటల్‌పాలైంది. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Also Read:BIG BREAKING: హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు!
ఐస్ క్రీంలో బల్లి
ఐస్ క్రీమ్ తిన్న ఆ మహిళ చెప్పిన వివరాల ప్రకారం.. పిల్లలు ఐస్ క్రీం తిందామని ఆమెను అడగడంతో.. మణినగర్‌లోని మహాలక్ష్మి కార్నర్ అనే షాప్‌కు వెళ్లారు. అక్కడ ‘హవ్మోర్’ బ్రాండ్‌కు చెందిన నాలుగు ఐస్ క్రీం కోన్లు కొన్నారు. అలా సగం తిన్న తర్వాత ఆమెకు బల్లి తోక కనిపించింది. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ఆమె తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో హాస్పిటల్‌పాలైంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం ఇంకా కుదటపడలేదని తెలుస్తోంది.
AMC seals ice cream parlour after customer claims finding a lizard in Havmor conehttps://t.co/ELLXxJvkcTpic.twitter.com/W5WYwwBnVF
— DeshGujarat (@DeshGujarat) May 14, 2025
Also Read: Andhra King Taluka: అదిరిపోయిన టైటిల్ గ్లింప్స్.. రామ్ కొత్త మూవీ టైటిల్ ఇదే
అయితే ఈ ఘటన సమయంలో ఆ మహిళ మాట్లాడుతూ.. తాము 4 ఐస్‌క్రీం కొన్నామని.. అందులో ఒక ఐస్ క్రీమ్‌లో బల్లి తోక కనిపించింది అని ఆమె దాన్ని చూపించింది. దీని తర్వాత తనకు తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు వస్తున్నాయని తెలిపింది. అదృష్టవశాత్తు తన పిల్లలు దీన్ని తినలేదని పేర్కొంది. ఏదైనా అయితే కంపెనీపై కేసు వేస్తామని తెలిపింది.
Also Read:ఇంతకీ 'NTR' ఎవరు..? నాల్గవ తరం వారసుడు పై నెటిజన్ల కామెంట్స్ హల్‌చల్!
ఇక ఈ విషయంపై ఆ మహిళ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పోరేషన్‌కు కంప్లైంట్ ఇచ్చింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఐస్ క్రీం అమ్మిన షాపును సీజ్ చేశారు. ఎలాంటి ఫుడ్ సేఫ్టీ యాక్ట్ కింద లైసెన్స్ లేదని గుర్తించి చర్యలు తీసుకున్నారు. అదే సమయంలో ఐస్ క్రీం తయారు చేసిన కంపెనీకి నోటీసులు జారీ చేశారు. అలాగే కంపెనీపై రూ.50వేల ఫైన్ వేశారు.
viral-videos | viral-news | latest-telugu-news | telugu-news | lizard