Dadasaheb Phalke Biopic: రాజమౌళికి బిగ్ షాక్.. ఆ సినిమా ఆగిపోయినట్టే..!

దాదాసాహెబ్ ఫాల్కేపై రెండు బయోపిక్స్ తెరకెక్కుతున్నాయి. అయితే ఫాల్కే మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ పుసల్కర్ SS రాజమౌళి తీస్తున్న "Made in India"పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. అలాగే ఆమిర్ ఖాన్, రాజ్‌కుమార్ హిరాని ప్రాజెక్ట్‌పై మాత్రం ప్రశంసలు కురిపించాడు.

New Update
Dadasaheb Phalke Biopic

Dadasaheb Phalke Biopic

Dadasaheb Phalke Biopic: దాదాసాహెబ్ ఫాల్కే..  భారతీయ సినిమా పితామహులు, జీవితాన్ని ఆధారంగా చేసుకుని రెండు బయోపిక్స్ తెరకెక్కుతున్నాయి. వీటిలో ఒకటి ఎస్.ఎస్. రాజమౌళి(SS Rajamouli) దర్శకత్వంలో "Made in India" పేరుతో, మరొకటి ఆమిర్ ఖాన్(Aamir Khan), రాజ్‌కుమార్ హిరాని(Raj Kumar Hirani) సంయుక్తంగా రూపొందిస్తున్న బయోపిక్. తాజాగా ఈ రెండు ప్రాజెక్టులపై దాదాసాహెబ్ ఫాల్కే మనవడు చంద్రశేఖర్ పుసాల్కర్(Chandrasekhar Srikrishna Pusalkar) తన అభిప్రాయాలను పంచుకున్నారు.

Also Read :  ఆల్కహాల్ బ్రాండ్ కి బాలయ్య యాడ్.. పద్మ భూషణ్ తిరిగి ఇవ్వాలంటూ నెటిజన్ల ట్రోలింగ్! వీడియో వైరల్

ఎస్.ఎస్. రాజమౌళి బయోపిక్ పై అసంతృప్తి

చంద్రశేఖర్ పుసాల్కర్ మాట్లాడుతూ.. ఎస్.ఎస్. రాజమౌళి తన కుటుంబ సభ్యులతో సంప్రదించకుండా "Made in India" బయోపిక్ ప్రకటించడం తనకు ఆశ్చర్యాన్ని కనిగించిందని అన్నారు. "రాజమౌళి గారు మా కుటుంబంతో సంప్రదించకుండా ఈ ప్రాజెక్ట్ ప్రకటించడం నన్ను ఆశ్చర్యపరిచింది. కనీసం మా అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంది," అని ఆయన అన్నారు.

Also Read : ఐస్ క్రీంలో బల్లి తోక.. కట్ చేస్తే రూ.50,000 ఫైన్ - వీడియో చూశారంటే?

ఆమిర్ ఖాన్, రాజ్‌కుమార్ హిరాని బయోపిక్ పై ప్రశంసలు

ఆమిర్ ఖాన్, రాజ్‌కుమార్ హిరాని సంయుక్తంగా రూపొందిస్తున్న బయోపిక్ పై చంద్రశేఖర్ పుసాల్కర్ ప్రశంసలు కురిపించారు. "ఆమిర్ ఖాన్, హిరాని గారు మా కుటుంబంతో గత మూడు సంవత్సరాలుగా చర్చలు  చేస్తున్నారు. వారి సహాయకులు హిందుకుశ్ భారద్వాజ్, ఆయుష్కర్ భారద్వాజ్ మా వద్దకు వచ్చి వివరాలు సేకరించారు. వారి శ్రద్ధ, నిజాయితీని చూసి, నేను వారికి అంగీకారం తెలిపాను," అని ఆయన చెప్పారు.

Also Read : నవంబర్‌లో కుప్పకూలనున్న మోదీ సర్కార్.. ?

తాతగారి భార్య పాత్రకు విద్యా బాలన్: ఫాల్కే మనవడు చంద్రశేఖర్ పుసాల్కర్

చంద్రశేఖర్ పుసాల్కర్, తన తాతగారి భార్య గారి పాత్రకు విద్యా బాలన్ చేస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని తెలిపారు. విద్యా బాలన్ నటనలో ఉన్న నైపుణ్యం ఈ పాత్రకు సరిపోతుందని అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ రెండు బయోపిక్స్ దాదాసాహెబ్ ఫాల్కే గారి జీవితాన్ని, భారతీయ సినిమా ప్రారంభాన్ని ప్రతిబింబిస్తాయి. అయితే, కుటుంబ సభ్యుల అభిప్రాయాలు, వారి అనుభవాలు ఈ ప్రాజెక్టులపై ప్రభావం చూపవచ్చు. భవిష్యత్తులో ఈ రొండు బయోపిక్స్ విడుదలై ప్రజల వద్ద నుండి ఎలాంటి  స్పందన దక్కించుకుంటాయో చూడాలి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు