Vijay Devarakonda: విజయ్ దేవరకొండ వాట్సాప్ చాట్ వైరల్! అమ్మ కోసం ఏం చేశాడో చూడండి

స్టార్ హీరో విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు. అమ్మ, నాన్నతో కలిసి డిన్నర్ కి వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేయడంతో పాటు ''కుదిరితే అందరం డిన్నర్ కి వెళ్దామా?'' అంటూ అమ్మ తనను అడిగిన క్యూట్ వాట్సాప్ చాట్ ను కూడా పంచుకున్నారు విజయ్.

New Update

Vijay Devarakonda: స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తన అమ్మ అడిగిన ఒక చిన్న కోరికను తీర్చారు. ''కుదిరితే మనమంతా కలిసి డిన్నర్ కి వెళదామా..? అంటూ అమ్మ అడగడంతో  వెంటనే అమ్మ కోసం డిన్నర్ ప్లాన్ చేశారు. అమ్మ, నాన్నతో కలిసి డిన్నర్ కి వెళ్లారు. వారితో సరదాగా టైమ్ స్పెండ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను విజయ్ తన ఎక్స్ లో పంచుకున్నారు. అలాగే డిన్నర్ కి వెళ్దామా? అంటూ అమ్మ అడిగిన స్వీట్ వాట్సాప్ చాట్ కూడా షేర్ చేశారు. 

అమ్మ సడెన్ గా అడిగింది

ఫొటోలను షేర్ చేస్తూ విజయ్ తన ఎక్స్ లో ఇలా రాసుకొచ్చారు.. ''అమ్మ సడెన్ గా  మనం డిన్నర్ కి వెళ్దామా అని అడిగింది.  మేము బయటకు వెళ్లి చాలా కాలం అయ్యింది, మేము మాత్రమే కాదు మనమందరం ఎల్లప్పుడూ పని,  లక్ష్యాల వెంట పరుగెడుతూ కొన్నిసార్లు   జీవించడం మర్చిపోతున్నాము.  నిన్న రాత్రి అమ్మ, నాన్నతో బయటకు వెళ్లి చాలా మంచి సమయాన్ని గడిపాము. మీ అమ్మ,  నాన్నలతో సమయం గడపడం, వారిని బయటకు తీసుకెళ్లడం, వారికి కొన్ని కౌగిలింతలు,  ముద్దులు ఇవ్వడం మర్చిపోవద్దు, మీరు వారిని ప్రేమిస్తున్నారని వారికి చెప్పండి ❤️❤️❤️'' అంటూ మంచి సందేశాన్ని  ఇచ్చారు. 

telugu-news | latest-news | cinema-news

Advertisment
తాజా కథనాలు