Kapil Sibal: పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి.. ఎంపీ డిమాండ్

పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని రాజ్యసభ ఎంపీ కపిల్‌ సిబల్ కేంద్రానికి సూచించారు. ఇందుకోసం చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA)లో సవరణలు చేయాలన్నారు. ఉగ్రవాదాన్ని పెకలించేసేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవాలన్నారు.

New Update
Rajya Sabha MP Kapil Sibal

Rajya Sabha MP Kapil Sibal

రాజ్యసభ ఎంపీ కపిల్‌ సిబల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలన్నారు. ఇందుకోసం చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA)లో సవరణలు చేయాలని కేంద్రానికి సూచనలు చేశారు. భారత్‌కు అతిపెద్ద సమస్యగా మారిన ఉగ్రవాదాన్ని పెకలించేసేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవాలన్నారు. పాకిస్థాన్‌ ఉగ్రదేశంగా జాబితా చేస్తూ షెడ్యూల్‌ను జోడించాలని చెప్పారు. 

Also Read: టర్కీకి ఓవైసీ సీరియస్ వార్నింగ్.. ఆ విషయం గుర్తు పెట్టుకోవాలంటూ.. !

Kapil Sibal Demands Amendment In UAPA

'' ఉగ్రవాద నిర్మూలన అనేది కేవలం భారత్‌, పాకిస్థాన్‌కే కాకుండా ప్రపంచ దేశాల పురోగతికి ఉపయోగపడుతుంది. కశ్మీర్‌ ప్రజలు అశాంతి లేకుండా ఉండాలంటే కేంద్రం ఈ చర్యలు తీసుకోవాలి. ప్రపంచ వేదికలపైకి వెళ్లినప్పుడు ఉగ్రవాద సమస్యపై చర్చించాలి. ఉగ్ర సంస్థలకు ప్రపంచ దేశాల నుంచి నిధులు రాకుండా అడ్డుకోవాలని''  కపిల్‌ సిబల్ అన్నారు. అలాగే పాకిస్థాన్ ఉగ్ర కుట్రలను ప్రపంచానికి చెప్పేందుకు భారత్‌ నుంచి అఖిలపక్ష బృందాలను విదేశాలకు పంపాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. 

Also Read: పాకిస్థాన్ స్పైగా ఇండియన్ యూట్యూబర్.. మొత్తం ఆరుగురు అరెస్ట్! ఆ రాష్ట్రాల్లో వీరి నెట్ వర్క్

విపక్ష పార్టీలతో జరిగిన మీటింగ్‌లో వాళ్లు ఇచ్చిన సలహాలు, సూచనలను ప్రధాని మోదీ అంగీకరించినట్లు తెలిపారు. దేశంలో అన్ని పార్టీలు కూడా ఉగ్రవాద నిర్మూలనకు ఏకమైతేనే ఆ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. ఇదిలాఉండగా భారత్‌తో యుద్ధానికి దిగిన పాకిస్థాన్‌ను ఏకాకి చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఉగ్రకుట్రలను ప్రపంచానికి చూపించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. ఆ టీమ్‌లకు ఏడుగురు ఎంపీలు నాయకత్వం వహిస్తున్నారు. వాళ్లలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్‌, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా ఉన్నారు.  

Also Read: ట్రంప్ పరువు పోయింది.. అమెరికా చరిత్రలోనే తొలి దారుణ పరాభవం!

Also Read :  అమెరికాలో ఉంటున్న భారతీయులకు బిగ్ షాక్.. ఎంబసీ కీలక ఆదేశం

 rtv-news | india-pakistan 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు