/rtv/media/media_files/2025/05/16/ZS08Xw8ioRztzg1vmKtY.jpg)
PM Modi
ఆపరేషన్ సిందూర్ తర్వాత మోదీ ప్రభుత్వంపై ప్రసంశలు వచ్చిన సంగతి తెలిసిందే. మరికొందరు కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించారని కూడా ప్రశ్నించారు. మొత్తానికి భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మోదీ సర్కార్ గ్రాఫ్ కాస్త పెరిగినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే తాజాగా సుశిల్ జీ అనే ప్రముఖ జ్యోతిష్యుడు ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
సెప్టెంబర్ 25 వరకు మోదీ ప్రభుత్వానికి ఎలాంటి సమస్య ఉండదని అన్నారు. ఆ తర్వాత ఈ ప్రభుత్వానికి కష్టాలు మొదలవుతాయని అన్నారు. నవంబర్‌లో ప్రభుత్వం పడిపోతుందని.. ప్రధాని మోదీ కూడా అధికారం నుంచి తప్పుకుంటారని అంచనా వేశారు. అలాగే మధ్యంతర ఎన్నికలు కూడా రావొచ్చని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు చూస్తుంటే అలాంటి అవకాశం కూడా ఉందని పలువురు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.
Also Read : తారక్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. బర్త్ డేకు సర్‌ప్రైజ్‌లే.. సర్‌ప్రైజ్‌లే! హృతిక్ అదిరిపోయే గిఫ్ట్
Also Read: తమిళనాడులో లిక్కర్ స్కాం ప్రకంపనలు..భారీగా వసూళ్లు
అవకాశం ఉందా ?
వాస్తవానికి ఈ ఏడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న సంగతి తెలిసిందే. అక్టోబర్ లేదా నవంబర్‌లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అక్కడ అధికారంలో ఉన్న జేడీయూ ప్రభుత్వం ఎన్డీయే కూటమిలో ఉన్న సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికలకు ముందు సీఎం నితీశ్ కుమార్ ఎన్డీయేతో జతకట్టారు. అయితే ఈసారి ఎన్నికల్లో విపక్ష పార్టీ అయిన ఆర్‌జేడీ పార్టీ కూడా గట్టి పోటీ ఇవ్వనుంది.
ఒకవేళ ఈసారి నితీష్ కుమార్ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోతే.. బీజేపీకి కూడా గట్టి ఎదురుదెబ్బ తగులుతుంది. అప్పుడు నితీష్ కుమార్ ఎన్డీయే కూటమి నుంచి వెళ్లిపోయే అవకాశం లేకపోలేదు. తన రాజకీయ ప్రయోజనం కోసం నితీష్ కుమార్ ఓసారి ఎన్డీయే మరోసారి ఇండియా కూటమి వైపు మారిపోతుండటం సాధారణమే. ప్రస్తుతం కేంద్రంలో మోదీ ప్రభుత్వం.. జేడీయూ, టీడీపీ సపోర్ట్‌తోనే ఉన్న సంగతి తెలిసిందే. ఒకవేళ జేడీయూ.. ఎన్డీయే కూటమి నుంచి విడిపోతే అప్పుడు మోదీ సర్కార్‌కు సమస్యలు మొదలైనట్లే.
ఇదిలాఉండగా భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కేంద్రం ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై సీ ఓటర్ ఓ సర్వే నిర్వహించింది. మే 10, 11, 12న ఫోన్ ద్వారా ఈ సర్వే జరిపింది. పాకిస్థాన్‌పై కేంద్రం వ్యవహరించిన తీరుపై 68.1 శాతం మంది సంతృప్తి చెందినట్లు తెలిపారు. 5.3 శాతం మంది ప్రభుత్వ చర్యలపై అసంతృప్తి చెందామని చెప్పారు. మరో 15.3 శాతం మంది ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.
Also Read: పాక్ కు బిగ్ షాక్.. తాలిబన్లతో భారత్ చర్చలు!
ఇక కాల్పుల విరమణ ఒప్పందంపై మీ అభిప్రాయం ఏంటని అడిగిన ప్రశ్నకు 63.3 శాతం మంది దీన్ని సమర్థించారు.10.2 శాతం మంది కాల్పుల విరమణకు అంగీకరించకుంటే బాగుండేదన్నారు. ఇక 17.3 శాతం మంది దీనిపై ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. పాకిస్థాన్‌పై భారత్ తీసుకున్న చర్యలను 68.1 శాతం మంది సపోర్ట్ చేయగా.. కాల్పుల విరమణకు అంగీకరించడాన్ని 63.3 శాతం మంది సపోర్ట్ చేశారు. దీన్ని బట్టి కాల్పుల విరమణపై మోదీ సర్కార్ పై కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతున్నట్లు కనిపిస్తోంది. పలువురు నెటిజెన్లు ఈ అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు.
బీజేపీ మద్దతుదారులు మాత్రం ఇది నిజమయ్యే ఛాన్సే లేదని కొట్టిపడేస్తున్నారు. మరి.. సుశీల్ జీ చెప్పింది నిజం అవుతుందా? లేక మోదీ మూడో టర్మ్ పాలనను ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేస్తారా? అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Also Read : నవంబర్‌లో కుప్పకూలనున్న మోదీ సర్కార్.. ?
telugu-news | national-news | bjp | pm modi